సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఇంటింటికీ భగీరథ నీరు


Fri,July 12, 2019 01:50 AM

Water pipeline from Udayasamudram reservoir inaugurated in Nalgonda

- మంత్రి జగదీశ్‌రెడ్డి
- రూ.160కోట్లతో అభివృద్ధి పనులు


నల్లగొండ, నమస్తే తెలంగాణ: దేశానికి కొత్త పరిపాలన పద్ధతులు, కొత్త పథకాలు అందించింది తెలంగాణ రాష్ట్రమేనని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో రూ.160 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు కేటాయించిందో అదే విధంగా ఈ సారి పట్టణాలను ఆధునీకరించేందుకు ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికీ వర్షాలు లేక ఇంత కరువు చోటుచేసుకున్నప్పటికీ తాగునీటి సమస్య లేకుండా ఉందంటే అందుకు సీఎం కేసీఆర్ ముందు చూపే కారణమన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.

225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles