ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

Fri,September 20, 2019 02:23 AM

-జూరాలకు 80 వేలు, నారాయణపురకు 30 వేలు,
-ఆల్మట్టికి 34,324 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
-శ్రీశైలం నాలుగు గేట్లు, సాగర్ ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదల
-భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం

హైదరాబాద్/జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి/అయిజ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి/ నందికొండ/ చింతలపాలెం/కేతేపల్లి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కృష్ణాబేసిన్‌లో వరద పొంగులు మళ్లీ మొదలయ్యాయి. ప్రా జెక్టులకు ఇన్‌ఫ్లోలు కొనసాగుతున్నాయి. ఆల్మ ట్టికి 34,324 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అదేస్థాయిలో నీటిని దిగువలకు వదులుతు న్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 80 వేల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 83వేల క్యూసెక్కులుగా నమోదైంది. తొమ్మిది గేట్ల ద్వారా 53,598 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. నారాయణపురకు ఇన్‌ఫ్లో 30,000 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 25,200 క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువన వర్షాలకు గురువారం తుంగభద్ర జలాశయానికి 27,578 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో 27,518 క్యూసెక్కులుగా రికార్డయింది. ఐదు స్పిల్‌వే గేట్ల ద్వారా 7,685 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 1,24,103 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్రాజెక్టు నాలుగు క్రస్ట్ గేట్లను పది అడుగుల మేరఎత్తి నీరు వదులుతున్నారు. శ్రీ శైలం నుంచి మొత్తం అవుట్‌ఫ్లో 1,89,818 క్యూ సెక్కులు రికార్డవుతున్నది.ఇన్‌ఫ్లో భారీగా వస్తుండటంతో మరిన్ని గేట్లను ఎత్తే అవకాశమున్నది. శని, ఆదివారాల్లో శ్రీశైలానికి పర్యాటకులు పెరుగనున్నారు.
NGSAGAR1

సాగర్‌లో ఎనిమిది గేట్లు ఎత్తివేత

భారీగా ఇన్‌ఫ్లో వస్తుండటంతో గురువారం నాగార్జునసాగర్ ఎనిమిది క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదలచేసున్నారు. ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా అధికారులు.. క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదలను పెంచుతూ, తగ్గిస్తూ వస్తున్నారు. బుధవారం నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు.. రాత్రికి ఇన్‌ఫ్లో పెరుగడంతో మరో నాలుగు గేట్లకు ఎత్తి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. సాగర్ రిజర్వాయర్‌కు 1,52,410 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఎనిమిది క్రస్ట్‌గేట్లలో ఆరింటిని పది అడుగులు, రెండుగేట్లు ఐదు అడుగుల మేరకు ఎత్తి 1,05,996 క్యూసెక్కుల నీటిని దిగువకు పులిచింతలకు విడుదల చేస్తున్నారు.

తాలిపేరు గేట్లు ఎత్తి నీటి విడుదల

గోదావరిలోనూ వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన శ్రీరాంసాగర్‌కు 9,850 క్యూసెక్కుల వరద వస్తున్నది. గురువారం సాయంత్రం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 23 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతున్నది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో మూడు గేట్లను ఐదు అడుగులు ఎత్తి దిగువకు 9,285 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదలచేశారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌కు వరదనీరు చేరుతున్నది.
JURALA1
NGSAGAR

1630
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles