రికార్డుల ప్రక్షాళనలో తప్పులు


Sat,May 25, 2019 01:32 AM

Warangal Urban Farmer Suffering Revenue Officers Neglect For Land Registration

-వాస్తవ సాగుభూమి చూపని వైనం
- వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి తాసిల్దార్ చుట్టూ రైతు ప్రదక్షిణ

హసన్‌పర్తి: వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట గ్రామానికి చెందిన కాశబోయిన చిన్న కొమురయ్యకు ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామ రెవెన్యూ శివారులో ఖాతా నం.261లో 3.27 ఎకరాల భూమి ఉన్నది. భూమిని వారసత్వంగా ఇతని కుమారుడు రాజ్‌కుమార్ సాగుచేస్తున్నాడు. గతేడాది రెవెన్యూశాఖ నిర్వహించిన భూరికార్డుల ప్రక్షాళనలో తనకున్న 3.32 ఎకరాల భూమికి బదు లు 1.26 ఎకరాలు తక్కువగా నమోదైంది. రికార్డును సవరించాలంటూ తాసిల్దార్ కార్యాలయం చుట్టూ రాజ్‌కుమార్ తిరిగినా న్యాయం జరుగలేదు. చిన్న కొమురయ్యకు ఉనికిచర్లలోని సర్వే నంబర్ 345/బి లో మరో 2.30 ఎకరాల భూమి ఉన్నది. సర్వే నంబర్ 337/ఎఫ్‌లోని 37 గుంటల విస్తీర్ణంలో 22 గుంటలు ఉండగా నేషనల్ హైవేలో కొంతమేరకు అవార్డు తీసుకోగా 15 గుంటల భూమి మిగిలింది. వీటికి సంబంధించిన పాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి.

భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇచ్చిన కొత్త పాస్ పుస్తకాల్లో 345/బిలో 2.30 ఎకరాలకు బదులుగా 1.19 ఎకరాలు నమోదైంది. మిగతా 1.11 ఎకరాల భూమి నమోదు కాలేదు. సర్వే నెం.337/ఎఫ్‌లో మిగిలి ఉన్న 15 గుంటలు నమోదు కాలేదని రాజ్‌కుమార్ తెలిపారు. రికార్డులో తక్కువ నమోదైన భూమి విషయమై రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరుగలేదన్నారు. ఈ విషయంపై ధర్మసాగర్ తాసిల్దార్‌ను నమస్తే తెలంగాణ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. ఉనికిచర్ల గ్రామ రెవెన్యూ అధికారి రామ్మోహన్ వివరణ కోరగా బాధితరైతు సమస్య తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles