పాస్‌పుస్తకం ఇప్పించండి


Sun,June 16, 2019 02:05 AM

Warangal Rural district Farmer Suffering Revenue Officers Neglect For Pattadar Passbook

- వరంగల్ రూరల్ జిల్లా ఈర్యతండా రైతు బానోతు బాల్య
చెన్నారావుపేట: పట్టాదారు పాస్‌పుస్తకం ఇప్పించండి సారూ.. అంటూ వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట గ్రామ శివారు ఈర్యతండాకు చెందిన గిరిజన రైతు బానోతు బాల్య వేడుకుంటున్నారు. పాస్‌పుస్తకం కోసం రెండేండ్లుగా తాసిల్దార్ కార్యాలయం, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా కనికరించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈర్యతండాలోని సర్వే నంబర్లు 386లో 1.16 ఎకరాలు, 387/అలో 21 గంటలు, 390/ 386/ అలో 1.32 ఎకరాలు, 386/అలో 35.5 గుంటలు, 382/అలో 1.2 ఎకరాలు.. మొత్తం 5.27 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూములకు సంబంధించిన కొనుగోలు కాగితాలు (స్టాంప్ పత్రాలు) కూడా ఉన్నాయి. సాదాబైనామాలోని తన భూములను పహాణీలో ఎక్కించి పాస్‌పుస్తకం అందించాలని దరఖాస్తుచేసినా ఇప్పటివరకు పహాణీలో పేరు ఎక్కించలేదని, పాస్‌పుస్తకం కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

గతేడాది సర్వేయర్ తన భూమిని సర్వే కూడా చేశారని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు పహాణీలో పేరు ఎక్కలేదని, పాస్‌పుస్తకం రాలేదని వాపోతున్నారు. రెండేండ్లుగా తాసిల్దార్, వీఆర్వో వద్దకు వెళ్తున్నా రేపు, మాపు అంటూ తిప్పించుకుంటున్నారే తప్ప పని మాత్రంచేయడం లేదని రైతు బానోతు బాల్య ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే రెవెన్యూ ఉన్నతాధికారులు కనికరించి తనకు పాస్‌పుస్తకం ఇప్పించి రైతుబంధు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఈ విషయంపై తాసిల్దార్ సదానందంను వివరణ కోరగా.. రెండు రోజుల్లో రైతు బానోతు బాల్యకు సంబంధించిన భూముల కాగితాలను పరిశీలించి పాస్‌పుస్తకం అందిస్తామని చెప్పారు.

825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles