వంగరకు హరితశోభ


Tue,August 13, 2019 02:56 AM

Warangal reached Haritha Haram target

- ఆదర్శంగా నిలిచిన దివంగత పీవీ సొంతూరు
- స్మృతివనం, గురుకులం చుట్టూ పచ్చదనం


వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: దేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందిన దివంగత ప్రధాని వీపీ నరసింహారావు సొంతూరైన వంగరకు హరితహారం కొత్త శోభ తెచ్చిపెట్టింది. మహోన్నత వ్యక్తి నడయాడిన నేలను రాష్ర్టానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో చేపట్టిన హరితహారం గ్రామానికి పచ్చలహారంగా మారింది. వరంగల్‌అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో జిల్లా యంత్రాంగం నాటిన నాలుగువేల పైచిలుకు మొక్కలు బతికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వంగరలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నేతృత్వంలో దాదాపు రెండున్నరేండ్ల కిందట హరితహారం చేపట్టారు. ఐదెకరాల కమ్యూనిటీ ప్లాంటేషన్ పేరిట 2,200 నీడనిచ్చే మొక్కలు నాటారు. అక్కడున్న తెలంగాణ గురుకుల పాఠశాల ఆవరణలో మరో మూడు నుంచి నాలుగు ఎకరాల మేర మొక్కలు నాటారు. అవన్నీ ఏపుగా పెరిగాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మొక్కలు నాటడంతోపాటు హరితరక్షకుడిని (వాచర్) నియమించింది.
Haritha-Haram1
కమ్యూనిటీ ప్లాంటేషన్ చుట్టూ కందకం తవ్వి జంతువులు, పశువులు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గురుకుల పాఠశాల (ఇన్‌స్టిట్యూషన్ ప్లాంటేషన్)లో భాగంగా నాటిన మొక్కలను విద్యార్థులు, అధ్యాపకులు కలిసి సంరక్షించారు. రెండేండ్ల కిందట నాటిన హరితహారం మొక్కలు బాగా పెంచినందుకు, ఆ పాఠశాలకు హరితమిత్ర అవార్డు కూడా దక్కింది. అవార్డు కింద పారితోషికంగా వచ్చిన నగదుతో గురుకుల పాఠశాల ప్రాంగణంలో బోరు వేయించారు. దీంతో మొక్కలను బతికించుకొనేందుకు నీటి కొరత సమస్య లేకుండాపోయింది. చిత్తశుద్ధితో సమూహ భాగస్వామ్యంతో విజయవంతమై వంగర హరితహారం రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
Haritha-Haram2

ప్రతి మొక్కను బతికించే ప్రయత్నం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది మరింత బాధ్యతాయుతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అందులో భాగంగానే ప్రతి వెయ్యి మొక్కలకు ఒక వాచర్‌ను నియమిస్తున్నాం. ఇటీవల సర్పంచులు, వార్డుమెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాం. వంగర విజయగాథను వివరించాం. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతిగ్రామానికి హరితరక్షక కమిటీలు వేశాం. నాటిన ప్రతి మొక్కను బతికించాలన్న పట్టుదలతో కలెక్టర్ మార్గదర్శకాలు రూపొందించారు.
- రాము, పీడీ (డీఆర్‌డీఏ), వరంగల్ అర్బన్ జిల్లా

571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles