ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభ


Wed,June 12, 2019 02:38 AM

warangal Chaitanya Degree and pg engg College students launches Compressed Air Vehicle

కంప్రెస్‌డ్ ఎయిర్ వెహికిల్ ప్రదర్శన
వరంగల్ క్రైం: వరంగల్‌లోని చైతన్య డిగ్రీ, పీజీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు తెరలేపారు. నాలుగో ఏడాది చదువుతున్న మెకానికల్ విభాగం విద్యార్థులు సోలార్‌తో నడిచే యంత్రాలతోపాటు అధిక పీడనంతో నడిచే వాహనాన్ని రూపొందించి మంగళవారం ప్రదర్శించారు. వీటిని కళాశాల కరెస్పాండెంట్ పురుషోత్తంరెడ్డి పరిశీలించి విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. కాలుష్య రహిత వాహనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు విద్యార్థులు క్రాంతికుమార్, పవన్, శరత్, దివ్య, స్వాతి, రాకేశ్ కలిసి అధిక పీడనంతో నడిచే (కంప్రెస్‌డ్ ఎయిర్ వెహికల్)ను అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజు ఆధ్వర్యంలో రూపొందించారు. ఇందులో సిలిండర్, పైప్స్, 4 చక్రాలను వినియోగించారు.

engg-students2

సోలార్ ట్రైసైకిల్

వికలాంగులకు అనుగుణంగా సోలార్ ఆధారిత ట్రైసైకిల్‌ను ప్రాజెక్టు పర్యవేక్షకుడు సాగర్ ఆధ్వర్యంలో మెకానికల్ విభాగానికి చెందిన విద్యార్థులు ఆశిష్ ప్రసాద్, అమీర్ ఫాహాద్, పున్నం రాజు, లవ్‌చంద్ర, బబన్ కుమార్ రూపొందించారు. సోలార్ ఆధారిత శక్తితో ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలుగా వాహనాన్ని రూ పొందించినట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ శంకరలింగం పేర్కొన్నారు. ఇందులో సోలార్ ప్యాన ల్స్, బ్యాటరీలు, ట్రైసైకిల్‌ను విద్యార్థులు వినియోగించినట్లు తెలిపారు.

సోలార్ పవర్‌హాక్స్..

వివిధ లోహాలను సోలార్‌శక్తితో సులువుగా కట్ చేసేందుకు పవర్‌హాక్స్ యంత్రాన్ని తయారు చేశారు. అక్విల్ రఫీ, రాజ్‌కుమార్, జహిత్‌అలీ, సాహేబ్‌ఖాన్, అనూష, ఫయాజ్‌సైఫ్,వాజిద్ ప్రాజెక్టు పర్యవేక్షకుడు హరీశ్ ఆధ్వర్యంలో రూపొందించారు. దీని తయారీకి సోలార్ ప్యానల్, వైపర్‌మోటర్, బ్యాటరీ బ్లేడ్స్‌ను వినియోగించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ పురుషోత్తంరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ప్రిన్సిపాల్ శంకరలింగం, మెకానికల్ విభాగాధిపతి బీ రాజ్‌కుమార్, సీఆర్వో డాక్టర్ విద్యనాథ్ తదితరులు విద్యార్థులను అభినందించారు.

972
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles