కల్మన్‌కల్వలో అధికారుల విచారణ


Sun,July 21, 2019 01:56 AM

VRO Response on Dharmaganta Article

-క్షేత్రస్థాయిలో పరిశీలన, భూరికార్డుల తనిఖీ
-మహబూబ్‌నగర్ రూరల్ సీఐపై ఎస్పీ ఆగ్రహం!
-పోలీస్‌కు రెవెన్యూ వత్తాసు కథనంపై స్పందన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నవాబ్‌పేట: పోలీస్‌కు రెవెన్యూ వత్తాసు శీర్షికతో శుక్రవారం నమస్తే తెలంగాణ ధర్మగంటలో ప్రచురితమైన కథనానికి అధికారు లు స్పందించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కన్మన్‌కాల్వ గ్రామంలో విశ్రాంత డీఎస్పీ కిష్టయ్య భూబాగోతంపై కథనం ప్రచురితమైం ది. దీనిపై ఇంటెలిజెన్స్ పోలీసులు శుక్రవారం గ్రామానికి వెళ్లి బాధితుల వద్ద వివరాలు సేకరించారు. పరిశీలన కోసం డాక్యుమెంట్లను తీసుకొన్నారు. శనివారం స్థానిక తాసిల్దార్ సూచన మేరకు ఆర్‌ఐ గోవర్ధన్, వీఆర్వో ప్రణీత్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బాధితుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి, భూమి వద్ద పంచనామా నిర్వహించారు.

గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డితోపాటు బాధితులు మరుగని కృష్ణయ్య, రంగయ్యతో మాట్లాడి వివరాలు సేకరించారు. పంచనామా రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆర్‌ఐ తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు అధికారులను వేడుకొన్నారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి స్పందించి మహబూబ్‌నగర్ రూరల్ సీఐ కిషన్‌ను తన కార్యాలయానికి పిలిపించుకొని వివరాలు అడిగి తెలుసుకొన్నట్టు సమాచారం. భూ తగాదాలో తలదూర్చి రిటైర్డ్ డీఎస్పీ కిష్టయ్యకు మద్దతు తెలుపుతూ.. బాధితులను బెదిరింపులకు గురి చేశాడనే అభియోగాలపై సీఐ కిషన్‌పై ఎస్పీ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
Dharmaganta1

109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles