అన్నదమ్ముల పేరిట పట్టా


Thu,May 16, 2019 02:16 AM

VRO examined the Land records

-పట్టామార్పిడిలో ఇష్టారాజ్యం కథనానికి స్పందన
-రికార్డులను పరిశీలించిన ఆర్డీవో లింగ్యానాయక్

దేవరకొండ, నమస్తే తెలంగాణ: నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములకు జరిగిన అన్యాయంపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన పట్టామార్పిడిలో ఇష్టారాజ్యం కథనంపై అధికారులు స్పందించారు. బుధవారం దేవరకొండ ఆర్డీవో గుగులోతు లింగ్యానాయక్ నేరెడుగొమ్ము తాసిల్దార్ కార్యాలయానికి చేరుకొని బాధితులైన లావుడ్య హతీరాం, హరి సోదరులను పిలిపించి విచారణ జరిపారు. భూ రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో అక్రమంగా పేరుమార్పిడి జరిగినట్లు పరిశీలనలో తేలింది. దీంతో బన్నికి, లావుడ్య హతీరాం, హరికి నోటీసులు జారీ చేసి గురువారం తాసిల్దార్ సమక్షంలో హియరింగ్ నిర్వహించాలని ఆదేశించారు. విచారణ అనంతరం అర్హులైన వారికి న్యాయంచేస్తామని ఆర్డీవో తెలిపారు.

697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles