లక్ష లంచం ఎట్లిస్తా?


Thu,May 16, 2019 01:41 AM

vro demands bribe for passbook in warangal urban district

బతుకుదెరువు కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చిన.. ఇక్కడే కారు డ్రైవర్‌గా కష్టించి పని చేస్తున్న. కొత్తపేట గ్రామంలో నాకు తాత, తండ్రినుంచి వారసత్వంగా వచ్చిన ఎకరం పన్నెండు గుంటల భూమి ఉన్నది. దీన్ని నా ముగ్గురు కుమార్తెల్లో ఒక్కొక్కరికి 15 గుంటల చొప్పున రాసిచ్చాను. ముగ్గురిలో ఒక అమ్మాయి మరణించింది. మిగతా ఇద్దరిలో ఒక్క అమ్మాయిని నా చెల్లి కొడుక్కి ఇచ్చి పెండ్లి చేశాను. 15 గుంటల భూమి రాసిచ్చాను. అయితే, నా చెల్లి ఎన్కతాల మణెమ్మ పదిహేను గుంటల బదులు.. మొత్తం ఎకరం పన్నెండు గుంటల భూమిని అక్రమంగా పొందింది.

ఈ అన్యాయాన్ని ఆలస్యంగా తెలుసుకొని ఊరికెళ్లాను. పూర్తి వివరాల్ని రెవెన్యూ అధికారులకు చెప్పాను. నా స్థలం నాకు ఇప్పించి న్యాయం చేయాలని కోరాను. ఈ సమస్యను పరిష్కరించడానికి కొత్తపేట వీఆర్వో భిక్షపతి లక్ష రూపాయల లంచం అడిగారు. అది ఇస్తేనే నా భూమిని నాకు ఇప్పిస్తానని నమ్మబలికాడు. హైదరాబాద్‌లో కారు నడిపే నేను.. లక్ష రూపాయల లంచం ఎలా ఇవ్వగలను? నాకు అంత స్థోమత ఎక్కడిది? నా సమస్యను ఆర్డీవో గుర్తించి పరిష్కరించాలని కోరుతున్నాను.
- పండుగ బిక్షపతి, కొత్తపేట గ్రామం, వరంగల్ అర్బన్ జిల్లా.

750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles