ఆలోచించి ఓటేయండి


Thu,December 6, 2018 02:45 AM

vote for right person says pawan kalyan

-దాశరథి చెప్పినట్టు స్వేచ్ఛను గెలిపించండి
-పారదర్శక, అవినీతిరహిత పాలన అందించేవారిని ఎన్నుకోండి
-తెలంగాణ ప్రజలకు పవన్‌కల్యాణ్ పిలుపు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకొన్న తెలంగాణ ప్రజలు ప్రస్తుత ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. పోరాటస్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను గుర్తించి ఓటేయాలని సూచించారు.7న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం పవన్‌కల్యాణ్ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు జనసేన పార్టీ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ధనం దాచగలరేమోగానీ, తేజస్సును దాచగలరా? తలలు దించగలరేగానీ, శిరస్సులు వంచగలరా? తమ మంత్రం పారదింకా.. ఉచ్చు తెంచుకొని జింక ఇక స్వేచ్ఛాప్రయాణం.. ఇదే తెలంగాణ.. మన కోటి రతనాలవీణ.. అని దాశరథి చెప్పిన మాటలు నా మదిలో మారుమోగుతున్నాయి అని చెప్పారు. దాశరథి చెప్పినట్టుగానే ప్రజలు స్వేచ్ఛను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రాంత పోరాటస్ఫూర్తి, త్యాగాలను గుర్తించినవాడిని అయినందునే తెలంగాణ అంటే ఎంతో గౌరవమని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవటంతో తమ పార్టీ పోటీచేయలేకపోయిందన్నారు. తెలంగాణను తెచ్చినవారు, తెలంగాణను ఇచ్చామనేవారు, తెలంగాణను దించామనేవారు.. ప్రజల ముందున్నారని చెప్పారు. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయకూడదు అనే అయోమయానికి గురికావాల్సిన అవసరంలేదని.. ఎక్కువ పారదర్శకత, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పాలన అందించారో వారినే గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. చివరగా జై తెలంగాణ.. జైహింద్ అంటూ ప్రసంగాన్ని ముగించారు.

3035
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles