చెట్టును ఢీకొట్టిన కారు


Sun,August 13, 2017 01:27 AM

vikarabad si  trainee women constable murders

వికారాబాద్ ఎస్బీ ఎస్సై, ట్రైనీమహిళా కానిస్టేబుల్ దుర్మరణం
మరో ట్రైనీ మహిళా కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు.. హిమాయత్‌సాగర్ సర్వీస్ రోడ్‌లో ప్రమాదం

kalilరాజేంద్రనగర్:వర్షంలో శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొట్టడంతో వికారాబాద్ ఎస్బీ ఎస్సై మహ్మద్ ఖలీల్‌పాషా(35), ట్రైనీ మహిళా కానిస్టేబుల్ కీర్తి(25) దుర్మరణం చెందారు. మరో ట్రైనీ మహిళా కానిస్టేబుల్ మమత తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ హిమాయత్‌సాగర్ సమీపంలోని సర్వీసు రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం గుండుమాల్‌కు చెందిన మహ్మద్ సాహెబ్ కుమారుడు మహ్మద్ ఖలీల్‌పాషా వికారాబాద్‌లో ఎస్బీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయ న కొన్ని రోజులుగా తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. అంబర్‌పేటకు చెందిన కీర్తి, రామంతాపూర్‌కు చెందిన మమత కూడా మహిళా కానిస్టేబుళ్లుగా అక్కడే శిక్షణలో ఉన్నారు. శనివారం అకాడమీలో సెలవులు ఇవ్వటంతో ట్రైనీ మహిళా కానిస్టేబుళ్లు.. ఎస్సైని లిఫ్ట్ అడిగినట్టు సమాచారం.

si
ట్రైనీ మహిళా కానిస్టేబుళ్లతో కలిసి ఖలీల్‌పాషా.. తన స్విఫ్ట్ డిజైర్ కారులో రాత్రి 7.30 గంటల సమయంలో నగరానికి బయలుదేరారు. హిమాయత్‌సాగర్ సమీపంలోని లార్డ్స్ కాలేజీ గేటు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును వేగంగా ఢీకొట్టింది. కారు నడుపుతున్న ఖలీల్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక సీట్లో కూర్చున్న మహిళా కానిస్టేబుళ్లు కీర్తి, మమతకు తీవ్రగాయాలయ్యాయని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వీ ఉమేందర్ తెలిపారు. వర్షం పడుతుండటం తో ప్రమాదం జరిగాక ఎవరూ అటు వెళ్లలేదని, కొద్దిసేపటి తర్వాత అటుగావెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారని చెప్పారు. ఘటనాస్థలికి చేరుకుని.. కీర్తి, మమతను చికిత్సకోసం దవాఖానకు తరలించినట్టు ఉమేందర్ వివరించారు. ఖలీల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదుచేసినట్టు తెలిపారు. కేర్ దవాఖానలో చికిత్సపొందుతూ కీర్తి మృతిచెందింది. ఖలీల్‌పాషా చేవెళ్ల, దోమ, పరిగి తాండూర్ పోలీస్‌స్టేషన్లలోనూ విధులు నిర్వహించారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

1133

More News

VIRAL NEWS

Featured Articles