దళితుడి భూమి కబ్జా


Sat,September 14, 2019 02:01 AM

Vikarabad District Farmers Suffer Land Registration

-కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా పట్టని తాసిల్దార్, పోలీసులు
-వికారాబాద్ జిల్లా రైతు ఆవేదన

హైదరాబాద్,నమస్తే తెలంగాణ: దళిత రైతుకు రక్షణ కరువైంది. ప్రభుత్వం అసైన్‌చేసిన భూమి ని కబ్జాదారులు క్రమించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా కోర్టుకు వెళ్లండని ఓ అధికారి ఉచిత సలహా ఇస్తే.. భూమి మీదకు వెళ్లి దున్నుకో.. కొట్లాట అయితే అప్పుడు వస్తామని పోలీసులు చెప్పారు. దీంతో ఏమిచేయాలో అర్థం కానీ దళిత రైతు ఎర్ర మల్లప్ప చివరకు ధర్మగంటను ఆశ్రయించారు. నాది వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం జంట్లుపల్లి గ్రామం. నాకు సర్వే నంబర్ 621/1/2/1/3లో రెండు ఎకరాల భూమి ని ప్రభుత్వం అసైన్‌చేసింది. నాకు ప్రభుత్వం ఇచ్చిన ఈ భూమిని ఏ సాయిలు అనే వ్యక్తి ఆక్రమించుకొన్నాడు. భూమిపైకి వెళ్తే కొట్టడానికి వస్తున్నాడు. దౌర్జన్యం చేస్తున్నాడు. భూమిని దున్నడానికి ట్రాక్టర్‌ను తీసుకెళ్తే రానివ్వడం లేదు. నా భూమిని ఆక్రమించుకున్నారని తాసిల్దార్ వద్దకు వెళ్తే కోర్టుకు వెళ్లండని ఉచిత సలహా ఇచ్చాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే మీరు భూమిలోకి వెళ్లి కొట్లాడండి.. మీరు కొట్టుకుంటే అప్పుడు వస్తామని చెప్పా రు. ఏమిచేయాలో అర్థం కాక కోర్టుకు వెళ్లా ను. కోర్టు నాకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డ ర్ ఇచ్చింది. అధికారులు దీనిని కూడా అమలుచేయడం లేదు. కోర్టు ఆర్డర్‌తో భూమి మీదకు వెళ్లినా కబ్జాదారు రానివ్వడం లేదు. కోర్టు ఆర్డర్ చూపించినా అధికారులు ఎవ్వ రూ పట్టించుకోవడం లేదు. ఏమిచేయాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా నా భూమిని నాకు ఇప్పించండి.

కబ్జాదారులపై చర్యలు తీసుకొంటాం

అసైన్ భూమిని కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకొంటాం. ఫిర్యాదు ఇవ్వమని బాధితుడికి చెప్పండి. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే పోలీస్‌లకు ఫోన్‌చేసి చెపుతాను. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదుచెయ్యమనండి. వీఆర్వో, గిర్దావర్‌ను గ్రామానికి పంపించి చర్యలు తీసుకొంటాను.
- మల్లేశ్‌కుమార్, యాలాల్ తాసిల్దార్

224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles