గుండెపోటుతో పశుసంవర్ధకశాఖ అధికారి మృతి


Thu,September 13, 2018 01:10 AM

veterinary department officer anjaiah died over heart attack

సిద్దిపేట కలెక్టరేట్, నమస్తే తెలంగాణ: విధి నిర్వహణలో గుండెపోటుకు గురై సిద్దిపేట జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ అంజయ్య మృతి చెందారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో లబ్ధిదారులకు పాడి గేదెలు, గొర్రెలు, మత్స్యకారులకు పరికరాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా అంజయ్య కుప్పకూలారు. స్థానికులు గమనించి ఆయనను హుటాహుటిన సిద్దిపేట జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారమందుకున్న మంత్రి హరీశ్‌రావు దవాఖానకు చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. పశు సవంర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సిద్దిపేటకు చేరుకొని అంజయ్య పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు.

492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles