పట్నం మహేందర్‌రెడ్డిని గెలిపించాలి


Thu,May 16, 2019 03:03 AM

vemula prashanth reddy mlc election campaign in rangareddy district

-మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డిని గెలిపించాలని రోడ్డు రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లాలో ని చేవెళ్ల, పరిగి, వికారాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. 31న జరుగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయానికి కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రు లు కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మహేశ్వర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మెతుకు ఆనంద్, ప్రకాశ్‌గౌడ్, పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, ఇంచార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు బాలమల్లు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

77
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles