పత్తిలోడు వ్యాన్ బోల్తా 12 మందికి గాయాలు

Mon,November 11, 2019 01:21 AM

మునుగోడు: పత్తిలోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తాపడి 12 మంది కూలీలకు గాయాలైన ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మం డలం కోతులారం శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన వ్యాన్ యజమాని కొంపల్లి నుంచి పత్తి లోడ్‌తో కిష్టాపురానికి బయ లుదేరాడు. మార్గమధ్యంలో కోతులారం దాటగానే ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోగా వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో పత్తిలోడ్‌పై కూర్చున్న 12 మంది కూలీలు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నల్లగొండ జిల్లాకేంద్ర దవాఖానకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.

234
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles