షికాగో సెక్స్‌రాకెట్‌లో కన్నడ హీరోయిన్లు!


Mon,June 18, 2018 04:56 PM

US investigators uncover Tollywood sex racket run by Indian origin couple in Chicago

-టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న వ్యభిచార దందా
-బీ1, బీ2 విజిటర్ వీసాలపై అమెరికాకు సినీతారల తరలింపు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: షికాగో సెక్స్‌రాకెట్ కేవలం టాలీవుడ్‌లోనే కాదు కన్నడ సినీపరిశ్రమలో కూడా కలకలం సృష్టిస్తున్నది. తెలుగులో కొన్ని చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేసిన మోదుగుమూడి కిషన్, తన భార్య చంద్రకళతో కలిసి అమెరికాలోని షికాగోలో ఉంటూ.. తెలుగు సినీపరిశ్ర మకు చెందిన ద్వితీయశ్రేణి నటీమణులను వ్యభిచారంలోకి దించుతున్నట్టు వెల్లడైన విషయం తెలిసిందే. ప్రస్తు తం వారు ఫెడరల్ పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా సెక్స్‌రాకెట్‌లో భాగంగా కిషన్ కన్నడ హీరోయిన్లను కూడా అమెరికాకు తరలించినట్టు తెలుస్తున్నది. అమెరికాలోని తెలుగు సంఘాలు నిర్వహించే పలు కార్యక్రమాలకు ఇక్కడ నుంచి పలువురు నటులు, సినీనేపథ్యం ఉన్నవారు తరచూ వెళ్తుండటంతో ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారి ంది. ఏప్రిల్ చివరివారంలోనే మోదుగుమూడి కిష న్, చంద్రకళను అమెరికా పోలీసులు అరెస్టు చేసినా, షికాగో ట్రిబ్యూన్ మీడియా సంస్థ ఇచ్చిన కథనంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఏడాదిలో 76 విమాన టిక్కెట్లు కొనుగోలు..

మోదుగుమూడి కిషన్, చంద్రకళ వివిధ కార్యక్రమాలు, స్టార్‌నైట్స్ పేరిట హీరోయిన్లు, మోడల్స్, యాంకర్లను బీ1, బీ2 విజిటర్స్ వీసాలపై అమెరికాకు తీసుకొచ్చేవారు. హీరోయిన్లతో శృంగారంలో పాల్గొనాలనే కోరిక ఉన్న విటుల వద్ద నుంచి ఒక్కసారి శృంగారానికి రూ.వెయ్యి నుంచి 3 వేల డాలర్ల వరకు (రూ.70 వేల నుంచి రూ.2 లక్షలు) వసూలు చేసేవారు. ఈ పనుల కోసం 2016 నవంబర్ 8 నుంచి 2017 నవంబర్ 29 మధ్యకాలంలో నిందితులు 76 విమాన టికెట్లను కొనుగోలు చేశారు.

ఇలా బట్టబయలైంది..

దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (టీఏఎస్‌సీ) కాలిఫోర్నియాలో నిర్వహించే స్టార్‌నైట్ కార్యక్రమానికి హాజరవుతున్నట్టుగా ఓ హీరోయిన్ గత ఏడాది నవంబర్ 8న అమెరికాకు వచ్చింది. అయితే కార్యక్రమం ముగిసిన రెండురోజుల తర్వాత అమెరికాకు వచ్చిన ఆమె కాలిఫోర్నియాకు కాకుండా షికాగోకు వెళ్లింది. దీంతో హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో సదరు హీరోయిన్‌ను తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో మొత్తం విషయం బయటకువచ్చింది.

5502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles