అమెరికా సంస్థలకిదే పెట్టుబడి సమయం


Thu,September 12, 2019 03:03 AM

US Consulate General Joel Reifman Meets Minister KTR

అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మాన్‌కు వివరించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో అమెరికా సంస్థలకు ఉన్న పెట్టుబడి అవకాశాలను పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు.. అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మాన్‌కు వివరించారు. రెండోసారి మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మాన్ బుధవారం మర్యాదపూర్వకంగా సమవేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు హైదరాబాద్‌లో అమెరికా పెట్టుబడుల గురించి చర్చించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే దీటుగా హైదరాబాద్ అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ వివరించారు. నగరంలోని వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను తెలియజేశారు. క్యాథరిన్ హడ్డా స్థానంలో జోయల్ రీఫ్‌మాన్.. కాన్సుల్ జనరల్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. కాన్సుల్ జనరల్‌తోపాటు కాన్సులర్ చీఫ్ ఎరిక్ అలెగ్జాండర్, ఎకనామిక్ స్పెషలిస్టు క్రిఫ్టెన్ లోయర్ మంత్రిని కలిసినవారిలో ఉన్నారు. ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles