కరీంనగర్‌లో క్లినికల్ ట్రయల్స్?


Wed,August 14, 2019 01:07 AM

Unlicensed Hepatitis B Vaccine Sale at District Center

-జిలా ్లకేంద్రంలో అనుమతిలేని హెపటైటిస్ బీ వ్యాక్సిన్ విక్రయం
-వైద్య పరిజ్ఞానం లేకుండానే ఇంజక్షన్లు ఇస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కరీంనగర్ క్రైం: కరీంనగర్‌లో క్లినికల్ ట్రయల్స్ కలకలం రేపింది. అనుమతిలేని హెపటైటిస్ బీ వ్యాక్సిన్‌ను విక్రయించడం, జిల్లా ప్రభుత్వ వైద్యులు అనుమానాలు వ్యక్తంచేయడం ఆందోళన కలిగిస్తున్నది. వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి మంగళవారం జిల్లాకేంద్రంలోని కట్టరాంపూర్‌లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్లను ఇస్తుండగా, అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సోదాలు చేయగా, వ్యాక్సిన్ బాటిళ్లతోపాటు మదర్ థెరిస్సా ఫౌండేషన్ పేరిట రసీదు పుస్తకాలు లభ్యమయ్యాయి. స్టేషన్‌కు తరలించి విచారించిన పోలీసులు ఆ వ్యక్తిని వరంగల్‌కు చెందిన రమేశ్‌రెడ్డిగా గుర్తించారు. డిగ్రీ చదివిన రమేశ్‌రెడ్డికి ఎలాంటి వైద్య పరిజ్ఞానంలేకుండానే వ్యాక్సిన్లు ఇస్తున్నట్టు గుర్తించారు. అనధికారిక ట్రయల్స్ కావొచ్చని వైద్యాధికారులు అనుమానం వ్యక్తంచేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles