భూగర్భజలాల రీచార్జ్


Mon,February 11, 2019 02:22 AM

Underground water activities to increase water reserves

-నీటి నిల్వలు పెంచేందుకు భూగర్భ జలశాఖ చర్యలు
-ఐదు జిల్లాల్లో 181 రీచార్జ్ షాఫ్టుల నిర్మాణం
-నల్లగొండ జిల్లా చండూర్‌లో పైలట్ ప్రాజెక్టు విజయవంతం
-సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లోనూ ఏర్పాటు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలను రీచార్జ్ చేయడం ద్వారా నీటినిల్వలు పెంచేందుకు భూగర్భ జలవనరులశాఖ చర్యలు చేపట్టింది. మిషన్ కాకతీయ పథకంతో మెరుగైన చెరువుల్లో సహజంగానే నీరు భూమిలోకి ఇంకి నిల్వలు పెరిగినప్పటికీ.. కృత్రిమంగా రీచార్జ్ షాఫ్టుల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలో ని చండూర్ మండలంలో రీచార్జ్ షాఫ్టులను నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. జిల్లా లో 20 చెక్‌డ్యాంల వద్ద రీచార్జ్ షాఫ్టుల నిర్మించడంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు మెరుగుపడ్డాయి. దాంతో సిద్దిపేట, నాగర్‌కర్నూల్, జనగామ, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లోని 65 గ్రామాలను గుర్తించి రీచార్జ్ షాఫ్టులను నిర్మించేందుకు చర్యలు ప్రారంభించారు. ఐదు జిల్లాల్లో మొత్తంగా 181 రీచార్జ్ షాఫ్టులు నిర్మించాలని నిర్ణయించగా.. 42 రీచార్జ్ షాఫ్టుల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మేడ్చల్ జిల్లాలోని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దత్తత గ్రామాలైన కేశవరంలో 14, లకా్ష్మపూర్ 17 రీచార్జ్ షాఫ్టులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.

గ్రామస్థాయిలో తీర్మానం మేరకు నిర్మాణం

గ్రామస్థాయిలో ప్రజలు చర్చించి రీచార్జ్ షాఫ్టు ల నిర్మాణానికి చేసిన తీర్మానాన్ని భూగర్భ జల శాఖకు పంపాల్సి ఉంటుంది. అనంతరం చెక్‌డ్యాంల వద్ద రీచార్జ్ షాఫ్టులు నిర్మిస్తారు. ప్రతి చెక్‌డ్యాం వద్ద ఆరున్నర అంగుళాల వ్యాసం గల కేసింగ్ పైపును 40 మీటర్ల లోతు వరకు వేస్తారు. ఆ పైపులోకి మట్టి పోకుండా చుట్టూ గోడ నిర్మించడంతోపాటు నీరు పోవడానికి ఉన్న దారిలో జాలిని అమరుస్తారు. ఒక్కో రీచార్జ్ షాఫ్టు నిర్మాణానికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని, వీటిద్వారా నీరు త్వరగా భూమిలోకి ఇంకుతుందని భూగర్భ జలవనరుల శాఖాధికారులు చెప్తున్నారు. నల్లగొండ జిల్లా చండూర్ మండలంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో పరిసర మండలాల్లోని గ్రామాల ప్రజ లు తమ వద్ద కూడా రీచార్జ్ షాఫ్టులు నిర్మించాలని కోరుతున్నారని, అక్కడ నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నట్టు అధికారులు స్పష్టంచేశారు.
recharge-shaft1

4245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles