ఒకే మాట.. ఒకే బాట

Fri,January 11, 2019 02:20 AM

-జోరుగా ఏకగ్రీవాలు.. ప్రోత్సాహక నిధులకే జనం మొగ్గు
-రోజురోజుకూ పెరుగుతున్న తీర్మానాలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: పల్లెల అభివృద్ధికి ఆయా గ్రామాల వారు ఒకే మాట.. ఒకే బాట సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. ప్రభుత్వమిచ్చే రూ. 10 లక్షల ప్రోత్సాహకంతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు ప్రకటించిన అదనపు నిధులు సాధించేందుకు పాలక వర్గాలను ఏకగ్రీవం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎక్కడికక్కడ సమావేశమై తమ పంచాయతీ పాలక వర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తీర్మానాలు చేస్తున్నా రు. రోజురోజుకూ తీర్మానాలు పెరుగుతున్నా యి. గురువారం కూడా పెద్ద ఎత్తున తీర్మానాలు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా ఎల్ది ఎల్లమ్మ, ఉపసర్పంచ్‌గా జెర్ర సతీశ్, వార్డు సభ్యులుగా సంగ ఓదెలు, మ్యాకల సమ్మయ్య, పూదరి శ్రీలత, నేతుల వనమ్మ, నేతుల కేతమ్మ, కనబోయిన శ్రీనివాస్, సింగరబోయిన లావణ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ స్థానికులు తీర్మా నం చేశారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో కొత్త జీపీగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు(ఏఎస్సార్) తండాను స్థానికులు ఏకగ్రీవం చేసుకున్నారు. సర్పంచ్‌గా గుగ్లావత్ జమున, ఉపసర్పంచ్‌గా గుగ్లావత్ మహేశ్‌తోపాటు వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు తీర్మానం చేశారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును మర్యాదపూర్వకంగా కలువగా ఆయన వారిని అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామపంచాయతీ వాసులు ఏకగ్రీవానికి మద్దతు పలికారు. సర్పంచ్‌గా మునిగె అమృతవ్వ, ఉపసర్పంచ్‌గా పొన్నవేణి బాలమల్లు, వార్డుసభ్యులుగా మా మిండ్ల జగన్, పులి మల్లయ్య, మామిండ్ల దేవవ్వ, దనాల శోభ, మామిండ్ల బుగ్గరాములు, మునిగె వేణు, మునిగె మల్లీశ్వరీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

వికారాబాద్ జిల్లాలో గురువా రం మరో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. బంట్వారం మండలం మద్వాపూర్ సర్పంచ్‌గా పట్లోళ్ల గోవింద్‌రెడ్డిని, మర్పల్లి మండలం నర్సాపూర్ పెద్ద తండా సర్పంచ్‌గా ధరమ్‌సింగ్, ఉపసర్పంచ్‌గా కాశీరాం, వార్డు సభ్యులుగా రుక్కిబాయి, బన్సీబాయి, రాజు, గోపాల్, సంతోష్, కాశీరాం, మోహన్, వఖిల్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో మూడు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. పాగుంట, తూర్పుతండా, ఉమిత్యాలతండాల్లో ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ వేయడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఏకగ్రీవాలు ఇలా..

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతున్నది. తొలివిడత నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన తరువాత ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైన పంచాయతీలను ఏకగ్రీవమైనట్టుగా ప్రకటించనున్నారు. అయితే నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగిసిన తరువాత ఏకగ్రీవాల సం ఖ్య మరింత పెరగనున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్ దాఖలైన పంచాయతీల సంఖ్య జిల్లాల వారీగా ఇలావున్నాయి. కొత్తగూడెం జిల్లాలో 10, ఖమ్మంలో 4, రంగారెడ్డిలో 8, కరీంనగర్‌లో 3, రాజన్న సిరిసిల్లలో 9, జగిత్యాలలో 7, మంచిర్యాలలో 1, ఆసిఫాబాద్‌లో 8, వరంగల్ అర్బన్ జిల్లాలో 5, వరంగల్ రూరల్‌లో 15, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 16, మహబూబాబాద్‌లో 12, జనగామలో 11, కామారెడ్డిలో 17, నిజామాబాద్‌లో 14, ఆదిలాబాద్‌లో 39, నిర్మల్‌లో 31, మహబూబ్‌నగర్‌లో 23, నాగర్‌కర్నూల్‌లో 17, జోగుళాంబ గద్వాలలో 3, వనపర్తిలో 10, సూర్యాపేటలో ఒకటి, నల్లగొండ జిల్లాలో 11 పంచాయతీలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి.

పార్టీలకతీతంగా కలిసిరావాలి: ఎమ్మెల్యే బండ్ల

ధరూర్ /మల్దకల్: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్, మల్దకల్ మండలాల్లో సర్పంచ్ అభ్యర్థులతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గురువారం సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు పంచాయతీల ఏకగ్రీవం కోసం పార్టీలకతీతంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవానికి సహకరించిన అభ్యర్థ్థులకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని భరోసా కల్పించారు.

1799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles