గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి


Thu,September 12, 2019 02:30 AM

two people died In Ganesh immersion

-వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి మృతి
భైంసా, నమస్తే తెలంగాణ/ భిక్కనూరు: గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకున్నది. నిర్మల్ జిల్లా బైంసాలో ఓ యువకుడు, కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయారు. బైంసా పట్టణంలో మంగళవారం రాత్రి శివసేన యూత్ గణేశ్ మండలి వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామున శోభాయాత్ర గోశాల వద్దకు చేరుకోగానే విద్యుత్ తీగలు తగిలి శంకర్(21) అక్కడికక్కడే మృతిచెందాడు. శంకర్ ముంబయిలో పెయింటింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌లో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని బుధవారం సాయంత్రం స్థానిక పాలొనికుంట చెరువులో నిమజ్జనానికి తరలించారు. తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శేఖర్(12) తీవ్రంగా గాయపడి దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు.

492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles