ఇద్దరు ఆర్డీవోలకు స్థానచలనం


Wed,September 12, 2018 01:01 AM

Two Ardivos are resettled

-మరికొంతమంది బదిలీకి కసరత్తు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఆర్డీవోలను బదిలీచేసి పోస్టింగ్‌లు ఇచ్చింది. సిరిసిల్ల ఆర్డీవో కే అనంతరెడ్డిని హుస్నాబాద్ ఆర్డీవోగా నియమించింది. హుస్నాబాద్ ఆర్డీవో టీ శ్రీనివాసరావును సిరిసిల్ల ఆర్డీవోగా నియమించింది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో పలువురు ఆర్డీవోలను బదిలీచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మూడేండ్లకుపైగా ఒకేస్థానంలో ఉన్నవారిని బదిలీచేసి వేరేచోట పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.

888
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles