త్వరలో రవిప్రకాశ్ అరెస్టు?


Thu,May 16, 2019 02:53 AM

TV9 Ravi Prakashs bail petition rejected by Telangana High court

-రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు
-బుధవారం విచారణకు గైర్హాజరు
-మూడు నోటీసులు భేఖాతర్
-లంచ్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫోర్జరీ కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. తమ ఎదుట హాజరుకావాలంటూ బుధవారం ఉదయం 11 గంటల వరకు సమయం ఇస్తూ సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు నోటీసులు జారీచేసినా.. రవిప్రకాశ్ విచారణకు డు మ్మాకొట్టారు. ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా ఆయన నుంచి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలపై సైబరాబాద్ పోలీసులు దృష్టిపెట్టారు. కాగా, తనపై సైబర్‌క్రైం పోలీసులు నమో దుచేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటివరకు ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో రవిప్రకాశ్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నామని, ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు నమస్తే తెలంగాణకు తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం హైకోర్టు నుంచి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో ఆయన సైబర్‌క్రైం ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవని పోలీసులు నిర్ధారించుకొన్నారు. పోలీసుల విచారణకు రవిప్రకాశ్ హాజరుకాకపోవడంపై పలురకాలుగా చర్చ జరుగుతున్నది. ఆయనపై ఇప్పటికే రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. రవిప్రకాశ్ ఎక్కడున్నాడని గుర్తించే పనిలో తెలంగాణ పోలీసులు నిమగ్నమయ్యారు. ఏపీలో తలదాచుకున్నాడన్న సమాచారం మేరకు ఆయనను పట్టుకోవడంపైనే ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు.

రంగంలోకి ప్రత్యేక బృందాలు!

ఏపీలోని అపద్ధర్మ ప్రభుత్వ పెద్దలతో ఉన్న సత్సంబంధాలతో రవిప్రకాశ్ అమరావతిలో ఆశ్రయం పొందినట్టు పోలీసులకు సమాచారం అందింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనుండటంతో వారికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకొంటాడని భావిస్తున్నారు. గురువారం నుంచి ప్రత్యేక బృందాలు తమ పనిని ప్రారంభించే అవకాశాలున్నాయి. రవిప్రకాశ్‌కు సంబంధించిన ఫోర్జరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్నది, న్యాయ సలహాల మేరకు దర్యాప్తులో ముందుకెళ్తామ ని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఇలా ఉండ గా తనపై సైబర్‌క్రైం పోలీసులు నమోదుచేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని రవిప్రకాశ్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరింది. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ అవసరంలేదని.. వేసవి సెలవుల తర్వాత సాధారణ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.

మీడియా నయీంను ఏ బాబు రక్షిస్తాడో

ట్విట్టర్‌లో వైసీపీ నేత విజయసాయిరెడ్డి
cపరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బుధవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసుల కు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీ సులు, చట్టాలు, కోర్టులు తనంతటి ప్రవక్తను టచ్ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పి టిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకొనే దారులన్నీ బంద్. ఈ మీడియా నయీంను ఏ బాబు రక్షిస్తాడో చూడాలి. నిజం చెప్పులు తొ డుక్కునేలోపు అబద్ధం పరారైపోయింది. విచా రణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవిప్రకాశ్ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే నకిలీ ప్రవక్త రాత్రికి రాత్రి దొడ్డిదారిలో గోడ దూకేసి బార్డర్ దాటేశాడు.

రేపో మాపో మాల్యా తో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూ ద్దాం అంటాడేమో అని ట్వీట్ చేశారు. ఏపీ చంద్రబాబుపైన కూడా సెటైర్లు వేశారు. సొంత పార్టీనేతలే ఎక్కడిక్కడ వెన్నుపోటు పొడిచా రంటూ ఎన్నికల సమీక్షల్లో తమ్ముళ్లు బావురు మంటుంటే వారిని ఎలా ఓదార్చాలో తెలియక బాబు బిక్కచచ్చిపోతున్నారట. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోయడం సంగతి సరే. సమీక్షలను ఇలాగే కొనసాగిస్తే కౌంటింగ్‌కు ముందే కొంప కొల్లేరని గ్రహించే రద్దు చేశారట అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

3500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles