గిరిజన డిగ్రీ గురుకులాల్లో 1455 పోస్టులుFri,October 13, 2017 02:51 AM

భర్తీకి అనుమతులిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు
ఎన్‌హెచ్‌ఏఐలో 40 నూతన కొలువులు

TelanganaLogo
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటుచేయనున్న 22 గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 22 డిగ్రీ కళాశాలల పరిధిలో 1,455 బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు అనుమతిస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సర్వీసు నిబంధనల ఆధారంగా గిరిజన సంక్షేమశాఖ ద్వారా ఈ నియామకాలను చేపట్టాలని అందులో పేర్కొన్నారు. ఆర్థికశాఖ అనుమతించిన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రిన్సిపల్-22, డిగ్రీ కాలేజీ లెక్చరర్- 880, లైబ్రేరియన్- 22, ఫిజికల్ డైరెక్టర్- 22, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- 22, సూపరింటెండెంట్- 22, మెస్ మేనేజర్/వార్డెన్- 22, స్టాఫ్ నర్స్-44, సీనియర్ అసిస్టెంట్- 22, కేర్‌టేకర్- 22, ల్యాబ్ అసిస్టెంట్- 88, కంప్యూటర్ ల్యాబ్‌అసిస్టెంట్-44, అసిస్టెంట్ లైబ్రేరియన్- 22, జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈవో- 22, స్టోర్‌కీపర్- 22, హెర్బేరియం/మ్యూజియం కీపర్- 22, రికార్డు అసిస్టెంట్- 22, ఆఫీస్ సబార్డినేట్- 88, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రార్- 1, డిప్యూటీ సెక్రటరీ- 2, అసిస్టెంట్ సెక్రటరీ-2, సూపరింటెండెంట్-3, సీనియర్ అసిస్టెంట్- 3, జూనియర్ అసిస్టెంట్-3, ఆఫీస్ సబార్డినేట్- 3, రీజినల్ కోఆర్డినేటర్-8 పోస్టులు ఉన్నాయి.

ఎన్‌హెచ్‌ఏఐలో 40 నూతన కొలువులు

నూతన కొలువుల భర్తీకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీచేసింది. సివిల్ ఇంజనీరింగ్, ఐటీ విభాగంలో 40 డిప్యూటీ మేనేజర్లు (టెక్నికల్)పోస్టులను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు విధించింది. అభ్యర్థులను గేట్ స్కోర్ ద్వారా ఎంపికచేస్తారు.

2622

More News

VIRAL NEWS