నేడు పాలిసెట్


Tue,April 16, 2019 01:23 AM

ts polycet 2019 exam held today

-హాజరుకానున్న 1.06 లక్షల మంది
-గంటన్నర ముందే కేంద్రాలకు చేరుకోవాలి
-పరీక్ష ప్రారంభం తర్వాత అనుమతి లేదు
-రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణామండలి కార్యదర్శి వెంకటేశ్వర్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం మంగళవారం నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్-2019)కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణామండలి కార్యదర్శి బీ వెంకటేశ్వర్లు తెలిపారు. పాలిసెట్‌కు 1,06,380 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 320 పరీక్షకేంద్రాలను ఏర్పాటుచేసి 48 మంది కోఆర్డినేటర్లను నియమించినట్టు ఆయన వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని, వేసవిలో విద్యార్థులకు కావాల్సిన అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

గంటముందే లోపలికి అనుమతిస్తాం

ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పాలిసెట్ కోసం కేంద్రాలకు గంటన్నర ముందే విద్యార్థులు చేరుకోవాలని, గంటముందు నుంచే పరీక్షకేంద్రాల్లోకి అనుమతిస్తామని కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్ష మొదలైన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యార్థులను అనుమతించబోమని స్పష్టంచేశారు. విద్యార్థులు 2 బీ లేదా హెచ్‌బీ పెన్సిల్‌తోపాటు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను ను తెచ్చుకోవాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు పరీక్షకేంద్రంలోకి అనుమతి లేదన్నారు. పరీక్షకు సంబంధించి బుక్‌లెట్‌లో ఇచ్చిన సూచనలను విద్యార్థులు తప్పకుండా పాటించాల్సిందేనని తెలిపారు. ఈ నెల 24న ఫలితాలను విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.

633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles