మాది ప్రజా ప్రభుత్వం


Fri,July 12, 2019 01:56 AM

TS Minister Etela Rajender Launch New Rythu Bazar In Jammikunta Market Yard

- పేదలకు విద్య, వైద్యం అందించే బాధ్యత మాదే
- రైతులకు అండగా ఉంటాం: మంత్రి ఈటల రాజేందర్


జమ్మికుంట/హుజూరాబాద్, నమస్తే తెలంగాణ: ఇది ప్రజా ప్రభుత్వం.. ప్రజల కోసమే పనిజేస్తది.. ధర్మం, న్యాయం వైపే ఉంటది అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ యా ర్డులో రూ.కోటి 40 లక్షలతో నిర్మించిన అధునాతన రైతు బజార్‌ను గురువారం మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుత రైతులను అం డగా ఉంటామన్నారు. రైతు బజార్లను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించే బాధ్యత తమదేనన్నారు. కొత్తగా కొలువుదీరిన జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకే పట్టంగట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తర్వాత మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, మార్కెట్, పీఏసీఎస్ చైర్మన్లు శారద, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. అనంతరం హుజూరాబాద్ సమీపంలోని కేసీ క్యాంపు గెస్ట్‌హౌస్‌లో హుజూరాబాద్ నియోజవర్గ స్థాయి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు.
Srinivas-Reddy
వర్ని : రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనీ, రైతు నాగలి పక్కన పెడితే దేశం అల్లకల్లోలం అవుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా వర్నిలో మార్కెట్ కమిటీ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
Eshwar
ధర్మపురి, నమస్తే తెలంగాణ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 75 శాతం సబ్సిడీపై 11 మంది మత్స్యకారులకు గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో లగేజీ ఆటోలను అందజేశారు.

196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles