ఆగ్రోస్ సేంద్రియ ఆహారం!


Thu,May 16, 2019 02:23 AM

TS Government is expected to sell Organic food products under Agras

-హైదరాబాద్‌లో స్టాళ్ల ఏర్పాటు
-పంజాబ్ నుంచి దిగుమతికి యోచన
-తెలంగాణ బ్రాండ్ పేరుతో విక్రయం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆగ్రోస్ ఆధ్వర్యంలో సేంద్రియ ఆహార ఉత్పత్తులను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నది. పం జాబ్ నుంచి దిగుమతి చేసుకొని తెలంగాణ బ్రాండ్ పేరుతో విక్రయించాలనుకుంటున్నది. హైదరాబాద్‌లోని సచివాలయం, శిల్పారా మం, జీహెచ్‌ఎంసీ స్థలాలతోపాటు, ప్రముఖ స్థలాల్లో స్టాల్స్ ఏర్పాటుచేయనున్నది. ఈ స్టాళ్ల ద్వారా సేంద్రియ గోధుమపిండి, పండ్లరసాలు, ఇతర ఉత్పత్తులను విక్రయిస్తారు. తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, ఆ సంస్థ ఎండీ సురేందర్ నేతృత్వంలోని త్రిసభ్య బృందం ఈ నెల 7 నుంచి 9 వరకు పంజాబ్‌లో పర్యటించింది. అక్కడి ఆగ్రోస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ఆధ్యయనం చేసింది. అనంతరం పర్యటన, అ ధ్యయనం చేసిన అంశాలతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రోస్ నివేదించింది.

మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో రడీ టు ఈట్

తెలంగాణ ఆగ్రోస్ బృందం లుథియానాలోని మార్క్‌ఫెడ్‌కు సంబంధించిన ప్యాకింగ్ హౌస్ ను సందర్శించింది. అక్కడ ఆలుగడ్డ, క్యారట్ ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించింది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో రడీ టు ఈట్ పేరుతో వివిధ రకాల కూరలను తయారుచేసి విక్రయిస్తున్నారు. వాటిని విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు. కోళ్ల పరిశ్రమను పరిరక్షించేందుకు కోడిగుడ్ల పొడిని విదేశాలకు తరలిస్తున్నారు. దీంతో అక్కడ కోళ్ల పరిశ్రమ బాగా పెరిగింది.

నోడల్ ఏజెన్సీగా 100 వ్యవసాయాధారిత పరిశ్రమలు

వ్యవసాయ వనరులను ఉపయోగించుకొని వ్యవసాయాధారిత పరిశ్రమలను పంజాబ్ పెద్ద ఎత్తున నెలకొల్పింది. కంపెనీలన్నింటినీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నడిపిస్తున్నారు. వీటన్నింటికీ ఆగ్రోస్ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది. పం జాబ్ ఆగ్రోస్ పరిశ్రమ సంస్థ ఆధ్వర్యంలో పం జాబ్ ఆగ్రో జూసెస్ లిమిటెడ్, పంజాబ్ అగ్రి ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, పంజాబ్ ఫుడ్ ప్రొక్యూర్‌మెంట్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటి ఆధ్వర్యంలో రూ.900 కోట్లతో 100 వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటుచేశారు. వాటి పెట్టుబడి విలువ రూ.3 వేల కోట్లపైనే ఉండే అవకాశం ఉంది. ఆ మూడు సంస్థల ఆధ్వర్యంలో వందల కోట్ల వ్యాపారం జరుగుతున్నది. పంజాబ్ ఆగ్రో జ్యూసెస్ లిమిటెడ్ సంస్థ ద్వారా రెండు పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఎగుమతి సంస్థ ద్వారా గోధుమలు, బాస్మతి బియ్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి కెనడాసహా పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles