బుల్లెట్, హైస్పీడ్ రైళ్లు దక్షిణాదికి రావా?


Fri,July 12, 2019 01:22 AM

TRS Working President KTR Tweet on Budget 2019

-బడ్జెట్‌పై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు అన్యాయం చేసిందని ట్విట్టర్‌లో ఆరోపించారు. రైల్వేల విస్తరణ, అభివృద్ధి గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. కొత్త రైల్వే సేవలు లేవు.. కొత్త రైల్వే లైన్లు లేవు.. కొత్త లైన్లకు సంబంధించి ఎలాంటి సర్వేలు లేవు.. బుల్లెట్ రైళ్లు లేవు.. హైస్పీడ్ రైళ్లు లేవు.. ప్రస్తుత రైల్వే ప్రాజెక్టులకు ఎలాంటి బడ్జెట్ పెంపు లేదు.. అన్నింటికీ లేదు అనే సమాధానమే. దీంతో పాటు బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు లేవు. బుల్లెట్, హైస్పీడ్ రైళ్లు పొందడానికి దక్షిణ భారత్‌కు అర్హత లేదా అని నిలదీశారు.

267
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles