గులాబీ పార్టీలోకి వలసల వెల్లువ


Mon,July 16, 2018 04:15 AM

TRS veterans train guns on Kavitha in Nizamabad

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: గులాబీ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఇతరులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ గూటికి చేరుతున్నారు. ఆదివారం కూడా భారీగా గులాబీ కండువా కప్పుకొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ బూత్ కమిటీ సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సమక్షంలో కాంగ్రెస్ నాయకులు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ కల్వకుంట్ల కవిత గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
WNP.jpg
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మేడిగూడకు చెందిన 50 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి జోగు రామన్న సమక్షంలో, వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డశాఖాపూర్‌లో టీడీపీ సర్పంచ్ లక్ష్మీదేవమ్మ, ఆమె భర్త వెంకటయ్య, నాయకులు రవీందర్‌రెడ్డి, రత్నారెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన రామకృష్ణతోపాటు 200 మంది కార్యకర్తలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అనుచరులు సుమారు వెయ్యిమంది ఎమ్మెల్యే జలగం వెంకటరావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం జోజిపేట నారాయణతండాలో 70 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నర్సంపేట మండలం ఇటుకాలపల్లికి చెందిన 100 మంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
BPT.jpg
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల విశ్వకర్మ సంఘం నాయకులు సుమారు 100 మంది మన్సురాబాద్, హయత్‌నగర్ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, సామ తిరుమలరెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడకు చెందిన 200 మంది మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సమక్షంలో, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గోవింద్‌తండా వాసులు 300 మందికిపైగా ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సమక్షంలో, మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం చింతపెల్లిలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సమక్షంలో, మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అంత్వార్ గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి సమక్షంలో, మహబుబాబాద్ జిల్లా బయ్యారంలో 150 కుటుంబాల వారు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో గులాబీ గూటికి చేరారు.
ADB.jpg
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇమాంపురానికి చెందిన 50 మంది టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఆదివారం మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అబ్రహం ఆధ్వర్యంలో, మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని అంబేద్కర్‌నగర్, బాలాజీనగర్, చంద్రపురి కాలనీలకు చెందిన సుమారు 120 మంది వివిధ పార్టీల వారు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వనస్థలిపురంలో యూత్ నాయకుడు మనీష్ ఆధ్వర్యంలో రెండు వందల మంది యువకులు టీఆర్‌ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జి రామ్మోహన్‌గౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

1160
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles