ఎంపీ వినోద్‌కు సన్మానం


Mon,September 10, 2018 01:26 AM

TRS MP Vinod Kumar felicitated for his contribution

ఆత్మగౌరవ భవనాలు మంజూరుపై మరాఠా, దూదేకుల ప్రతినిధుల హర్షం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో మరాఠీ భవన్ నిర్మాణానికి రెండెకరాల స్థలాన్ని, రూ.2 కోట్ల నిధులను కేటాయించిన సీఎం కేసీఆర్‌కు, ఎంపీ బో యినపల్లి వినోద్‌కుమార్‌కు మరాఠాలు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఉదయం వారు ఎంపీ వినోద్‌కు ధన్యవాదాలు తెలిపి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మరాఠీ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పటేల్, ఉపాధ్యక్షుడు నివాస్ నిఖం, ఎల్కే షిండే, సంయుక్త కార్యదర్శి మదన్ జాదవ్ పాల్గొన్నారు.

పునర్వివాహం చేసుకునేవారికి షాదీ ముబారక్ వర్తింపజేయాలని వినతి

దూదేకుల ఆత్మగౌరవ భవనకు రెండెకరాల స్థలం, రూ.2 కోట్లు మంజూరుచేయడం పై ఆ కులసంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు సహకరించిన కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌ను ఆదివారం ఆ సంఘం ప్రతినిధులు సన్మానించారు. నూర్‌బాషా, దూదేకుల (వృత్తి) సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దా సాహెబ్ ఆధ్వర్యాన వినోద్‌కుమార్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ ప్రతినిధి షకీల్ మన్సూర్, దక్షిణభారత విభాగం ప్రతినిధి షేక్ షకీనా, గౌరవ సలహాదారు ఎండీ అజీమొద్దీన్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మహమూద్ అలీ, కార్యదర్శి ఇబ్రాజ్ మ న్సూర్, కోశాధికారి నాగూర్, ఉపాధ్యక్షురాలు సలీమునాన్నీసా పాల్గొన్నారు. చిన్న వయసులో భర్త ను కోల్పోయి పునర్వివాహం చేసుకునే మహిళలకు షాదీముబారక్ వర్తింపచేయాలని, తెల్లరేషన్ కార్డులున్న పేదలకు సన్నబియ్యమివ్వాలని ఎంపీకి విన్నవించారు.

1107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles