గద్వాల-మాచర్ల రైల్వేలైన్ పూర్తిచేయాలి


Fri,July 12, 2019 01:57 AM

TRS MP Ramulu Speech In Parliament

-బడ్జెట్‌పై చర్చలో టీఆర్‌ఎస్ ఎంపీ పోతుగంటి రాములు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గద్వాల-మాచర్ల రైల్వేలైన్ వెంటనే పూర్తిచేయాలని, రెండురాష్ట్రాల ప్రజల మూడుదశాబ్దాల కలను సాకారంచేయాలని నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ ఎంపీ పోతుగంటి రాములు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో గురువారం ఆయన మాట్లాడుతూ.. గద్వాల-మాచర్ల సర్వే పూర్తిచేసి పదేండ్లు గడిచినా మోక్షం లభించలేదని, పూర్తిచేస్తామని మహబూబ్‌నగర్ బహిరంగసభలో అమిత్‌షా ప్రజలకు హామీ ఇచ్చారని, అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. భద్రాచలం, సత్తుపల్లి, కొవ్వూరు రైల్వేలైన్లను కూడా వేగంగా పూర్తిచేయాలన్నారు.

490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles