తెలంగాణ పథకాన్ని అమలుచేయండి

Sat,November 23, 2019 02:36 AM

-కిలో ప్లాస్టిక్‌కు కిలో బియ్యంతో గ్రామాలు శుభ్రం
-ఉపాధి హామీని ప్లాస్టిక్ సేకరణకు అనుసంధానించాలి
-లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ప్రారంభించిన కిలో ప్లాస్టిక్‌కు కిలో బియ్యం పథకాన్ని దేశమంతా అమలుచేయాలని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు సూచించారు. శుక్రవారం లోక్‌సభలో 193 నిబంధన కింద ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై చర్చలో నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా ఓ గ్రామంలో కిలోప్లాస్టిక్ తీసుకొచ్చి కిలో బియ్యం తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారని, దీంతో ఆ గ్రామమంతా ప్లాస్టిక్ రహితంగా మారిందని చెప్పారు. కేంద్ర అధికారుల ఆహ్వానంతో ఆ కలెక్టర్ ఢిల్లీకి వచ్చి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. దేశమంతా కిలో ప్లాస్టిక్‌కు.. కిలో బియ్యం పథకాన్ని తీసుకొస్తే ప్లాస్టిక్‌ను అరికట్టవచ్చని సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని ప్లాస్టిక్ సేకరణకు జోడిస్తే సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. వాయుకాలుష్యం, వాతావరణమార్పులపై జరిగిన చర్చలో నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ఇంధనంగా వందశాతం ఇథనాల్ ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ఇథనాల్ వినియోగిస్తే దాన్ని ఉత్పత్తి చేసే రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఒక వ్యక్తికి జీవితాంతం ఏడుచెట్ల నుం చి వచ్చే ఆక్సిజన్ అవసరమని, తెలంగాణలో దేశ జనాభాకు మించి 176 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. కేంద్రం ప్రవేశపెడుతున్న సంక్షేమపథకాల అమలులో ముందున్నరాష్ట్రాలకు నిధులమంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరా రు. అనంతరం ప్లాస్టిక్ పథకం బాగుందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌జవదేకర్ అభినందించారు.

గిరిజన విశ్వవిద్యాలయం ఏమైంది?: ఎంపీ బండా ప్రకాశ్

MP-BANDA
తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో కేంద్రం జాప్యం చేస్తున్నదని టీఆర్‌ఎస్ ఎంపీ బండా ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ విభజనచట్టంలో పేర్కొన్న గిరిజన విశ్వవిద్యాలయం తక్షణమే ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరగతులను ప్రారంభించినప్పటికీ యూనివర్సిటీపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని చెప్పారు. సమగ్ర నివేదిక సమర్పించినా యూనివర్సిటీని ఎందుకు ఏర్పాటుచేయడంలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.

కొత్త ఎఫ్‌ఎంలకు అవకాశం ఇవ్వండి: రంజిత్‌రెడ్డి

ranjitreddy
తెలంగాణలో కొత్త జిల్లాల్లో ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియోల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. ప్రస్తు తం తెలంగాణలో 11 ప్రైవేటు ఎఫ్‌ఎంలు ఉన్నాయని, రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నందున అన్నిజిల్లాల్లో ప్రైవేటు ఎఫ్‌ఎంల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రి ప్రకాశ్‌జవదేకర్ స్పందిస్తూ.. ఎఫ్‌ఎం-3 పాలసీ కింద కొత్తగా ప్రైవేటు ఎఫ్‌ఎంలకు పట్టణాల ప్రాతిపదికన అనుమతులు ఇస్తామని తెలిపారు.

1634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles