కాళేశ్వరానికి పైసా ఇవ్వలేదు


Fri,July 12, 2019 02:07 AM

TRS MP K Keshava Rao Speech in Rajya Sabha

-నిధుల కేటాయింపులో కేంద్రానిది మొండివైఖరి
-ఇదేనా సహకార సమాఖ్య?
-అంకెల్లోనే దేశం అభివృద్ధిని చూపారు
-బడ్జెట్‌పై రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయకు నిధుల కేటాయింపులో కేంద్రం మొండివైఖరి అవలంబిస్తున్నదని రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు ఆరోపించారు. నీతి ఆయోగ్ పదిసార్లు నిధులు విడుదల చేయాలని సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. స్వయంగా ప్రధాని అద్భుతమైన ప్రాజెక్టులని ప్రశంసించినప్పటికీ.. ఏ విధంగా కూడా ఆర్థిక మద్దతు లభించలేదని విచారం వ్యక్తంచేశారు. బడ్జెట్‌పై రాజ్యసభలో గురువారం కే కేశవరావు మాట్లాడారు. వ్యవసాయ ప్రధానమైన దేశంలో నీటి ప్రాజెక్టులు కడుతున్నామంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇదేనా సహకార సమా ఖ్య. కేంద్రం నుంచి సహకారం లభించనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేస్తున్నది.

మిషన్ కాకతీయ ద్వారా వందలాది చెరువులకు మరమ్మతులు చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి కేంద్రం వెనుకాడుతున్నది. జలశక్తి ద్వారా ఇంటింటికి తాగునీటిని ఎలా అందిస్తారో కేంద్రం సమాధానం చెప్పాలి అని కేశవరావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా కేంద్రం తెలంగాణ ప్రజలను అవమానించిందని చెప్పారు. తెలంగాణలో రైతుల నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా రైతు బంధు, రైతు బీమా అందిస్తున్నట్టు తెలిపారు. ఒడిశా కూడా తెలంగాణ దారిలో నడుస్తున్నదని పేర్కొన్నారు. జలశక్తి ద్వారా దేశంలో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తామంటూ చెప్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం మిష న్ భగీరథ ద్వారా ముందుగానే ఈ పని చేసింది. జలశక్తి పథకానికి ఎంత కేటాయింపులు జరిపిందో చెప్పడంలేదు. కనీసం ఎలా సాధ్యం చేస్తారో అనే స్పష్టతనైనా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు కోసం వెయ్యి కోట్లు ఇస్తామని మాట ఇచ్చి తప్పారని చెప్పారు. బడ్జెట్‌లో కొత్త విషయాలేమీ లేవని, పాత పథకాల కొనసాగింపే ఉన్నదన్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఎైక్సెజ్ సుంకం పెంచి సామాన్యులకు షాక్ ఇచ్చారని, భారత అభివృద్ధి అనేది బడ్జెట్‌లో పేర్కొన్నట్టు అంకెల్లోనే కనిపిస్తుందని ఎద్దేవాచేశారు. పూర్తి మెజార్టీతో గెలిచిన మోదీ ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని, అయితే అంచనాలకు తగినట్లుగా బడ్జెట్ లేదని విచారం వ్యక్తంచేశారు.

752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles