పొలాలకు నీళ్లు.. ప్రతిపక్షాలకు కన్నీళ్లు


Thu,June 20, 2019 02:27 AM

TRS MP Balka Suman Slams Telangana BJP Congress Leaders Over Kaleshwaram Project

-పదేండ్లు ప్రాణహిత- చేవెళ్లను ఎందుకు పూర్తి చేయలేదు
-కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్కరూపాయీ ఇవ్వలేదు
-ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుల పొలాల్లో నీళ్లు పారితే.. కాంగ్రెస్, బీజేపీ నేతలకు కన్నీళ్లు తప్పవని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడాన్ని ఆయా పార్టీల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అసహనంతో ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని లక్ష్మణ్ చెప్తున్నారని.. దేశంలో తెలంగాణ భాగం కాదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌తోపాటు, టీఆర్‌ఎస్ ఎంపీలు చిత్తశుద్ధితో కృషిచేయడం వల్లనే త్వరగా అనుమతులు వచ్చాయన్నారు.

కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసిందని, అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైనా ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తిచేశారా? అని నిలదీశారు. కేం ద్రంలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేండ్లపాటు అధికారంలో ఉన్న కాం గ్రెస్ పార్టీ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ఎం దుకు పూర్తిచేయలేకపోయిందని ప్రశ్నించారు. ముంపు సమస్యపై మహారాష్ట్రను ఎందుకు ఒప్పించలేకపోయిందన్నారు. మహారాష్ట్ర ప్ర భుత్వం బాబ్లీ, జైక్వాడ్ సహా ఇతర ప్రాజెక్టులు కడితే కాంగ్రెస్ నాయకులు నాడు స్పందించలేదని.. దీంతో ఎస్సారెస్పీకి నీళ్లు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. తమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాజెక్టును మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల అవసరాలకు వాడుకుంటామన్నారు. అన్నిరకాల ఆలోచనల తరువాతే మేడిగడ్డ వద్ద బరాజ్ కట్టాలని నిర్ణయించారని తెలిపారు. కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని తెలిపారు.

ఆయకట్టు పెరగడంతోనే అంచనా వ్యయం పెరిగిందని, కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సత్సంబంధాలు నెలకొల్పుతున్న తీరు దేశానికి రోల్‌మోడల్ అని సుమన్ అన్నారు. ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ అపరభగీరథుడిలా నీళ్లు అందించేందుకు యత్నిస్తున్న కేసీఆర్‌ను అభినందించాల్సింది పోయి కాంగ్రెస్, బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు.

1117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles