దివ్యాంగుడికి కేటీఆర్ అండ


Wed,June 12, 2019 02:56 AM

TRS MLC donates Honda Activa to physically disabled

-మేడ్చల్ జిల్లా యువకుడి ట్వీట్‌కు స్పందన
-ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహకారంతో బైక్ అందజేత

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ దుండిగల్: కాళ్లు కదపలేని స్థితిలో ఉన్న దివ్యాంగుడికి టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అండగా నిలిచారు. బైక్ అందజేసేలా సాయం అందించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వెన్నెలగడ్డకు చెందిన సంబరబోయిన గోపీకృష్ణ కొడుకు శివ పుట్టుకతో దివ్యాంగుడు. కూలిపని చేస్తూ గోపీకృష్ణ కొడుకును పోషిస్తున్నాడు. తండ్రికి తోడుగా ఉండేందుకు ప్రైవేట్ ఉద్యోగం చేద్దామంటే కాళ్లు కదపలేని దుస్థితి. ఇదే విషయాన్ని కేటీఆర్‌కు విన్నవించాడు శివ. కష్టాల్లో ఉన్నాను. కాళ్లు కదలకపోయినా పనిచేయాలనుకుంటున్నా. ఏదైనా వాహనం ఇప్పిస్తే తండ్రికి చేదోడుగా నిలువాలనుకుంటున్నా.

ఆదుకోండి సార్ అంటూ ఇటీవల ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. దీనికి కేటీఆర్ వెంటనే స్పందించారు. శివకు సాయం అందజేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు సూచించారు. దీంతో శంభీపూర్ రాజు సొంత ఖర్చుతో టీవీఎస్ జూపిటర్ బైక్‌ను శివకు ఇప్పించాడు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్.. శివకు ద్విచక్రవాహనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్, శంభీపూర్ రాజుకు శివ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇంచార్జి జహంగీర్, మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ktr-tweet2

తిరుపతిరెడ్డికి కేటీఆర్ అభినందన

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డిని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. మంగళవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు వీ నందు ఆధ్వర్యంలో తిరుపతిరెడ్డి ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. శంకర్‌పల్లి మాజీ సర్పంచ్, బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్, మరికొందరు దాతల ఆర్థికసాయంతో ఎవరెస్టును అధిరోహించినట్టు ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి చెప్పారు.

1242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles