గెలుపు గులాబీదే..


Mon,March 25, 2019 07:50 AM

TRS MLAs Campaigning In Telangana For Lok Sabha

-భారీ మెజార్టీ కోసం పనిచేయండి
-సర్కారు పథకాలను వివరించండి
-టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధుల పిలుపు

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల విజయం ఖాయమైపోయింద ని, భారీ మెజార్టీనే లక్ష్యంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షే మ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. ఆదివారం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, నిరం జన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నా యకులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లను కారుకే కట్టబెట్టి, సీఎం కేసీఆర్‌ను దేశరాజకీయాల్లోకి పంపించాలని పిలుపునిచ్చారు.

దేశం చూపు తెలంగాణవైపు: మంత్రి ఎర్రబెల్లి

అనతికాలంలోనే అభివృద్ధి సాధించి, అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ వైపు దేశ ప్రజానీకం చూస్తున్నదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేశానికి కేసీఆర్‌లాంటి మహానేత పాలనను ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన వరంగల్ రూరల్ జిల్లా దామెర మం డలం ఓగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ స్కూల్ ఆవరణలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి, మహబూబాబాద్‌లో నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఇతర నాయకులతో కలిసి ఎర్రబెల్లి ప్రసంగించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం ఎప్పుడో ఖాయమైందని, మెజార్టీపైనే కార్యకర్తలు దృష్టి కేంద్రీకరించాలని కోరారు. వరంగల్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను లక్ష మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. రౌడీరాజకీయాలను పాతరేసి.. టీఆర్‌ఎస్ అభ్యర్థికి లక్ష ఓట్ల మెజార్టీని అందించాలని కడియం శ్రీహరి కోరారు. సమావేశంలో ఎంపీ పసనూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లిపై గులాబీ జెండా: మంత్రి కొప్పుల

సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు రాష్ట్రంలో మరోమారు అధికారా న్ని ఇచ్చారని, తెలంగాణ మొత్తం కారు గాలి, కేసీఆర్ గాలి వీస్తున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ద ఎంపీ అభ్యర్థి వెంకటేశ్‌నేతకానిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.

వెన్నుపోటు పొడిచిన వివేక్: బాల్క సుమన్

చెన్నూరు, బెల్లంపల్లిలో నిర్వహించిన సమావే శాల్లో ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌కు ఓట్లు సీట్లు తప్ప ప్రజాసేవ అవసరంలేదని విమర్శించారు. మూడు పార్టీలు మారినా ఆయనకు సీఎం కేసీఆర్ గౌరవం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా అవకాశం ఇచ్చారని చెప్పారు. తనను పిలిచి నెక్స్ వివేక్‌కు టికెట్ ఇస్తున్నాం. నువ్వు శాసనసభకు వెళ్లు అని సీఎం చెప్పినట్టు గుర్తుచేశారు. వివేక్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు.

మానోతు కవిత గెలుపు తథ్యం: సత్యవతి

మహబూబాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత విజయం దాదాపు ఖాయమైందని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. భద్రాచలంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపకరించాయన్నారు.
Mahendarreddy1

నామాను గెలిపిద్దాం: తుమ్మల

ఖమ్మం టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పాలేరు, వైరా నియోజవర్గాల్లో జరిగిన టీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశాశంలో అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు మాట్లాడారు.

ఖమ్మంలో రెండు లక్షల మెజార్టీ ఖాయం: ఎమ్మెల్సీ పల్లా

చింతకాని: రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 16 సీట్లు గెలువడం ద్వారా ఢిల్లీలోని ఎర్రకోటపై పాగావేద్దామని, రెండులక్షల మెజార్టీతో ఖ మ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొ న్నారు. ఖమ్మం జిల్లా మధి ర నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ విసృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానున్నదన్నారు. రైతు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల వ్యవసాయాన్ని పండుగ చేశారని, రైతు బీమా, రైతుబంధు పథకాలు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ గొప్ప మనసున్న నాయకుడని చెప్పారు. ఆంధ్రాలో వైసీపీ, ఒడిశాలో నవీన్‌పట్నాయక్ గెలుస్తున్నారని పల్లా జోస్యం చెప్పారు. కార్యక్రమంలో ఖమ్మం టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కొటేశ్వరరావు, మధిర టీఆర్‌ఎస్ ఇంచార్జి కమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

రంజిత్‌రెడ్డిని గెలిపిద్దాం మాజీ మంత్రి పట్నం

చేవెళ్ల ఎంపీ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమష్టిగా కృషిచేద్దామని మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. పార్టీని మోసంచేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు. చేవెళ్ల పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేయడమే ధ్యేయమని చెప్పారు.

1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles