పల్లెలెట్ట కదులుతున్నయంటే!


Wed,September 12, 2018 01:45 AM

TRS MLA Candidates Campaign In Telangana

-టీఆర్‌ఎస్ అభ్యర్థికే మా మద్దతు అంటూ ఏకగ్రీవ తీర్మానాలు
-భారీ మెజార్టీతో గెలిపిస్తాం అని గ్రామస్థుల ప్రతిజ్ఞలు
-ప్రతిపక్షాలు మా గ్రామంలోకి రావొద్దు అంటూ ఊరి పొలిమేరల్లో వెలుస్తున్న ఫ్లెక్సీలు
-తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించేందుకు స్వచ్ఛందంగా ముందుకు కదులుతున్న పల్లెలు
-ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు.. నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు
-గ్రామగ్రామానా భారీ బైక్ ర్యాలీలు.. అడుగడుగునా జన నీరాజనాలు

గులాబీదండుకు మద్దతుగా పల్లెలు కదులుతున్నాయి. విస్తృతంగా పర్యటిస్తున్న అభ్యర్థులకు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నాయి. నుదుట తిలకంతో, మంగళ
హారతులతో, పూలవర్షాలతో ఘనంగా ఆహ్వానిస్తున్నాయి. పల్లెపట్నం అనే తేడాలేకుండా గులాబీని గుబాళింపజేస్తున్నాయి. తామంతా జట్టుకట్టి వచ్చే ఎన్నికల్లో కారు జోరును మరింత పెంచుతామంటున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థికే మా ఓటు అంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. కారు గుర్తు అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల్లారా.. మా గ్రామాల్లోకి ప్రవేశించకండి అంటూ పొలిమేరల్లోనే ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నాయి. మూకుమ్మడిగా కదులుతాం.. గులాబీ అభ్యర్థులను గెలిపిస్తాం అంటూ నినదిస్తున్నాయి. కులసంఘాలు మద్దతులు వెల్లువెత్తుతున్నాయి. వెరసి ఎక్కడికక్కడా పల్లెలు కదులుతున్నాయి! తెలంగాణ పల్లెలు కదిలి చూపిస్తున్నాయి!!
- నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్

తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల ప్రచారం జో రందుకున్నది. అభ్యర్థిత్వం ఖరారైనప్పటినుంచి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టీఆర్‌ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు మంగళవా రం నియోజకవర్గ కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికా రు. మాడ్గులపల్లి మండలం కుక్కడం నుంచి పది కిలోమీటర్ల మేర ర్యాలీగా బయలుదేరి మిర్యాలగూడకు చేరుకుని ప్రచారం చేట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ అభ్యర్థి రేఖానాయక్ శాంతినగర్ వీధిలో విస్తృత ప్రచా రం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి, ప్రభుత్వం చేపట్టి న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. మద్దతు ఇవ్వాలని కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి తాజా మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో చూస్తుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. పార్టీలో నాయకుల మ ధ్య ఐక్యత లేదని, అధికారం కోసం ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు.

భారీ ర్యాలీతో కోరం..

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య ఇల్లెందు, బయ్యారం, గార్ల మండలాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. మహబూబాబాద్ జిల్లా కేం ద్రంలో అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ కార్యకర్తలతో స మావేశం నిర్వహించి పలుసూచనలు చేశారు. అనంత రం ప్రచారం నిర్వహించారు. డోర్నకల్ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి కురవి మండలం నేరడలో ప్రచారం చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అభ్యర్థులు ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంథని, పెద్దపల్లి, రామగుండం ని యోజకవర్గాల ఇంచార్జి కర్ర శ్రీహరితో కలిసి మంథని అభ్యర్థి పుట్ట మధు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. వరంగల్ అర్బన్ జి ల్లా ఖిలావరంగల్‌లో అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వాకర్స్, రైతులను కలిసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వరంగల్ అర్బన్ జిల్లా పెద్దమ్మగడ్డలో పరకాల ముఖ్యనేతలు, శ్రేణులతో తాజా మా జీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

మంత్రి కేటీఆర్‌కే మా మద్దతు

-రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాలలో మహిళల ప్రతిజ్ఞ
TRSPracharam2
సిరిసిల్ల రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల మహిళలు వచ్చే ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌కే ఓటు వేస్తామని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మంగళవారం గ్రామంలోని 42 మహిళాసంఘాల గ్రూప్ లీడర్లు, గ్రామ మహిళలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు, ఆర్‌ఎస్‌ఎస్ గ్రామ కన్వీనర్ దడిగెల శ్రావణ్‌రావు సమక్షంలో మంత్రి కేటీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా శ్రావణ్‌రావు గ్రామ మహిళలకు, మహిళాసంఘాల సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

జూరాలకు స్వల్ప వరద

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జూరాల కు స్వల్ప వరద కొనసాగుతున్నది. మంగళవారం జూరాల ఇన్‌ఫ్లో 15,000, అవుట్ ఫ్లో 29,106 క్యూ సెక్కులు నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.255 టీ ఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి కాలువ ద్వారా 795 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1400 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 835 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భీమా లిఫ్ట్-1 ద్వారా 1300 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.

587.50 అడుగులకు చేరుకున్న సాగర్ నీటిమట్టం

నందికొండ/ అమ్రాబాద్ రూరల్: నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు( 312.05 టీఎంసీలు)గాను 587.50 (305.8030 టీఎంసీలు) అడుగులకు చేరుకున్నది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోగా.. సాగర్ ప్రాజెక్టు నుంచి 22144 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 175 (45.77 టీఎంసీలు) అడుగులకు గాను ప్రసుత్తం 148 (13.51 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు ఉన్నది. ఇన్‌ఫ్లో నిలిచిపోగా.. 9500 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతున్నది. 9694 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. 28 వేల 763 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నీటిమట్టం 879.30 అడుగులకు చేరి, 185.7062 టీఎంసీలుగా నమోదైంది. పోతిరెడ్డిపాడుకు 24,000 క్యూసెక్కులు, ఎంజీఎల్‌ఐకు 1600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
TRSPracharam1

సరస్వతీ కాలువకు నీటివిడుదల నిలుపుదల


మెండోరా: ఎస్సారెస్పీ నుంచి సరస్వతీ కాలువకు నీటి విడుదలను నిలిపి వేస్తున్నట్టు ఏఈఈ మహేందర్ తెలిపారు. కాకతీయ కాలువకు ఐదువేల క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 200 క్యూసెక్కులు, గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు 675 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి 6,460 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా.. 1086.10 అడుగులు (70.351 టీఎంసీల) నీటి నిల్వ ఉంది.
జెన్‌కోలో పెరిగిన విద్యుదుత్పత్తి: కాకతీయ కాలువకు 5,000 క్యూసెక్కుల నీటి విడుదలతో పోచంపాడ్ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి జరుగుతున్నది.

2947
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles