టీఆర్‌ఎస్‌కు జైకొట్టిన ఓటరు


Fri,May 24, 2019 03:50 AM

TRS Ministers MLAs Talks about Lok Sabha Result

- మంత్రులు, ఎమ్మెల్యేల స్పష్టీకరణ

నెట్‌వర్క్ నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలనతోనే ప్రజలు టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించారని మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ తొమ్మిది స్థానాల్లో ఘన విజయం సాధించడంతో వారు అభ్యర్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా నరేంద్రమోదీ హవా కొనసాగినా తెలంగాణ ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్‌కే మెజార్టీ స్థానాలను కట్టబెట్టారని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతోనే..

ఉమ్మడి పాలమూరు ప్రజలు రెండు ఎంపీ స్థానాలను గెలిపించి టీఆర్‌ఎస్ పార్టీపై విశ్వాసం ఉం చారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ శివారులోని నెల్లికొండ కౌంటింగ్ కేంద్రం వద్ద మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్‌తో ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, అబ్రహాం, బండ్ల కృష్ణమోహన్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి రాములును లక్షా 89 వేల 450 ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. తనను ఎంపీగా గెలిపిన ప్రజలకు రుణపడి ఉంటానని పోతుగంటి రాములు పేర్కొన్నారు.

పనిచేయని మోదీ హవా..

సర్జికల్‌ైస్ట్రెక్స్ పేరిట దేశాన్ని తామే కాపాడామని బీజేపీ భ్రమను కల్పించడంతో మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి కొంత మెజార్టీ తగ్గిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీగా గెలుపొందిన మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎ మ్మెల్యేలు లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌తో కలిసి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నరేంద్రమోదీ హవా ఉన్నా తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్ సత్తాచాటిందన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తొలిసారి ఎంపీగా పోటీ చేసినా తనను భారీగా మెజార్టీతో గెలిపించిన పాలమూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
NARSAPUR-Harish

టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం..

సీఎం కేసీఆర్‌పై ఉమ్మడి వరంగల్ ప్రజలు అచంచల విశ్వాసం ఉంచి లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి బ్రహ్మరథం పట్టారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ నాయకుల సమష్టి కృషితోనే వరంగల్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను 3.50 లక్షల భారీ మెజార్టీతో, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితకు లక్షపైచిలుకు మెజార్టీతో గెలుపొందారని చెప్పారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేశ్, తాడికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్‌రావు పాల్గొన్నారు.

కేసీఆర్‌పై నమ్మకంతోనే భారీ ఆధిక్యం

సీఎం కేసీఆర్‌పై నమ్మకంతోనే ప్రజలు మెదక్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి భారీ ఆధిక్యం అం దించారని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ ఎంపీగా గెలుపొందిన కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సునీతా లకా్ష్మరెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. జిల్లా ప్రజలు అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టి టీఆర్‌ఎస్‌కు దీవెనలు అందిస్తున్నారని వారికి ఎల్లావేళలా రుణపడి ఉంటామన్నారు.
Wgl-Dha

2064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles