హోటల్ సర్వర్లు.. హమాలీలుFri,April 21, 2017 01:32 AM

etela-rajendhar నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: ఈ నెల 27న నిర్వహించే టీఆర్‌ఎస్ బహిరంగ సభకు తరలివెళ్లేందుకు అవసరమైన తొవ్వ ఖర్చుల కోసం టీఆర్‌ఎస్ నేతలు హోటల్‌లో సర్వర్లుగా, రైస్‌మిల్లుల్లో, జినింగ్ మిల్లుల్లో హమాలీలుగా, పారిశుద్ధ్య కార్మికులుగా మారారు. గురువారం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కూలి పని చేసి రూ.11 లక్షలు సంపాదించారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పారిశుద్ధ్య కార్మికులుగా, హోటల్‌లో సర్వర్లుగా పనిచేసి రూ.6,16,116, జడ్చర్లలో మంత్రి లకా్ష్మరెడ్డి ఐస్‌క్రీంలు, మెడికల్ షాపులో మందులు విక్రయించి రూ.10 వేలు, జయశంకర్ భూపాలపల్లిజిల్లాలో రైస్‌మిల్లుల్లో మంత్రి అజ్మీరా చందూలాల్ కూలి పనిచేసి రూ.3 లక్షలు, ఖమ్మం జిల్లాలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూలి పనులు చేసి రూ.60 వేలు, హైదరాబాద్‌లోని పంజాగుట్ట హిందీకాలనీలోని పాలెం లెదర్స్‌లో కార్పొరేటర్ విజయారెడ్డితో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు కలిసి బ్యాగులు విక్రయించి రూ.1.5 లక్షలు సంపాదించా రు. వరంగల్‌లో ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యే సురేఖ దంపతులు దుక్కిదున్ని, చాయ్ విక్రయించి రూ.1.71 లక్షలు సంపాదించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఓ షోరూంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు, టీఆర్‌ఎస్ నేత సురేందర్‌రెడ్డి ఆటోలకు వాటర్‌వాషింగ్ చేసి రూ.25 వేలు సంపాదించారు.
srinivas-reddy

srinivas-goud

nayinee

874

More News

VIRAL NEWS