చెత్త కుప్పలో ఆడ శిశువు


Fri,July 12, 2019 01:49 AM

TRS Leaders saved a baby found in dustbin

- కాపాడిన టీఆర్‌ఎస్ నాయకులు కోరుట్ల పోలీసుల అదుపులో తల్లి

కోరుట్లటౌన్: చీరలో చుట్టి అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్తకుప్పలో వదిలివెళ్లిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గురువారం చోటుచేసుకున్నది. చిన్నారి ఆర్తనాదాలు విన్న టీఆర్‌ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ బట్టు సునీల్, కస్తూరి లక్ష్మీనారాయణ శిశువును దవాఖానకు తరలించారు. వివారల్లోకి వెళితే.. గుర్తుతెలియని వ్యక్తులు స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలో నవజాత శిశువును చీరలో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో వదిలివెళ్లారు. అటుగా వెళ్తున్న టీఆర్‌ఎస్ నాయకులు చిన్నారి ఏడుపు వినిపించగా పరిసరాల్లో పరిశీలించారు. చీరలో చుట్టిన శిశువును గుర్తించి, స్థానిక కేశవ దవాఖానకు తరలించి వైద్యం చేయించి, పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం పోలీసులు శివువును శిశు సంరక్షణ జిల్లా అధికారి హరీష్, ఐసీడీఎస్ సీడీపీవో తిరుమల దేవికి అప్పజెప్పారు. శిశువును చెత్తకుప్పలో వదిలివెళ్లిన మహిళను పోలీసులు అదుపులోకితీసుకున్నట్టు తెలిసింది.

573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles