లక్ష్యం దిశగా సభ్యత్వాలు


Fri,July 12, 2019 02:25 AM

trs leader are participated in TRS membership programme

-టీఆర్‌ఎస్ పిలుపునకు విశేష స్పందన
-పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా జోరందుకున్న ది. పార్టీ నాయకులు, కార్యకర్తలు వాడవాడలా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర నాయకులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. సభ్యత్వ నమోదు లో లక్ష్య సాధన దిశగా సాగుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు శాంతిభూషణ్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ గురువారం హైదరాబాద్‌లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతులమీదుగా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు తీసుకున్నారు.

ch-malla-reddy
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఉద్యోగులు టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో మరింత చురుగ్గా పా ల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, ప్రభరెడ్డి, ఎల్లాగౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు వెంకటయ్య, సాయిలు, షకీల్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ డిపో వద్ద జరిగిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి పలువురికి సభ్యత్వాలను అందజేశారు. దేశంలోనే నంబర్‌వన్ సీఎంగా కేసీఆర్ నిలిస్తే తెలంగాణలో టీఆర్‌ఎస్ నంబర్‌వన్ పార్టీ గా నిలిచిందని మల్లారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 90వేల నమోదైనట్టు చెప్పారు.

MAREDDY-srinivas-reddy

పాలమూరులో..

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్‌పల్లి, కుర్వగడ్డపల్లితోపాటు మిడ్జిల్ మండలం కంచనపల్లిలో జడ్చర్ల, షాద్‌నగర్ ఇంచార్జి చాడ కిషన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పూర్తి చేసిన సభ్యత్వ నమోదు ఆన్‌లైన్ కేంద్రాన్ని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. సభ్యత్వ నమోదు వివరాలను ఆన్‌లైన్‌లో క్రోడీకరించే వివరాలను ఆయన పరిశీలించారు.

puvvada-ajay-kumar

ఖమ్మంలో..

ఖమ్మం నగరంలోని 33వ డివిజన్‌లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వాలను అందజేశారు. తిరుమలాయపాలెం మండలంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, బోనకల్లు మండలంలో జెడ్పీ చైర్మన్ లింగా ల కమల్‌రాజు ఇంటింటికీ వెళ్లి సభ్యత్వాలు అందజేశారు. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోనూ సభ్యత్వ నమోదు ప్రక్రియలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని 6వ వార్డులో పలువురికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సభ్యత్వాలను అందజేశారు. భద్రాచలం పట్టణంలో నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జి తెల్లం వెంకట్రావ్ సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు.

nukala-naresh-reddy
అశ్వారావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి సభ్యత్వాలు అందజేశారు. కరీంనగర్‌లోని 22వ డివిజన్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. గంగాధర మండలం బూర్గుపల్లిలో రామడుగు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేతులమీదుగా సభ్యత్వ రసీదులు అందుకున్నారు.

nannapaneni

వరంగల్‌లో..

వరంగల్ నగరంలోని పలు డివిజన్లలో గురువా రం నిర్వహించిన సభ్యత్వ నమోదులో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులతోపాటు అడ్తి, ఖరీదు వ్యాపారులు, వివిధ కార్మి క వర్గాలకు పార్టీ సభ్యత్వం అందజేశారు. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో జరిగిన సభ్య త్వ నమోదులో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని పలువురికి సభ్యత్వాలు అందజేశారు. గ్రామంలో ముందుగా పొట్లపల్లి కృష్ణారావుకు సభ్యత్వం అందజేసి పార్టీలోకి ఆహ్వానించారు. ములుగు జిల్లా పత్తిపల్లి, పొట్లాపురం, అబ్బాపురం, ములుగులో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పాల్గొన్నారు.

uppala-srinivas-gupta
మెదక్ జిల్లా తూప్రాన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌కు పోటీ లేదని, సభ్యత్వ నమోదుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని శ్రీనివాస్‌గుప్తా పేర్కొన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఉప్పల నర్సింలు గుప్తా, కోశాధికారి పబ్బ చంద్రశేఖర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంతోష పాల్గొన్నారు.
trs-membership

312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles