టీఆర్‌ఎస్‌ది సెక్యులర్ ప్రభుత్వం

Thu,December 5, 2019 01:47 AM

-రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ మహ్మద్ ఖమృద్దీన్

మహబూబ్‌నగర్ టౌన్ : టీఆర్‌ఎస్‌ది సెక్యులర్ ప్రభుత్వమని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ మహ్మద్ ఖమృద్దీన్ అన్నారు. నవాబ్ మీర్ మ హబూబ్‌అలీ ఖాన్ బహద్దూర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో బుధవారం మహబూబ్‌నగర్ 129వ ఆవిర్భా వ దినోత్సవ వేడుకలను స్థానిక మున్సిపల్ టౌ న్‌హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవ్వగా, ఆయా మతాల ప్రతినిధులు పాల్గొన్నారు. నిజాం చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి వేడుకలను సర్వమత ప్రార్థనలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహ్మద్ ఖమృద్దీన్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో గంగాజము న తహ్‌జిబ్‌లా హిందు ముస్లింలు కలిసి మెలిసి ఉంటారని చెప్పారు. పాలమూరు అంటే ప్రేమ, ఆప్యాయతలకు నిలయమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నాదని తెలిపారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి 5 ఏండ్లల్లో జరిగిందన్నారు.జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు మహమూద్‌అలీ, వీహెచ్‌పీ సెక్రటరీ లకా్ష్మరెడ్డి, షాషాబ్‌గుట్ట దర్గా పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్ రజాక్‌షా ఖాద్రీ, రెవరెండ్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles