ఫెడరల్ వ్యవస్థ బలోపేతం కావాలి


Thu,June 20, 2019 02:16 AM

TRS Focus On Jamili Elections

-జమిలి ఎన్నికలకు తెలంగాణ ఓకే..
-కానీ రాష్ట్రాల అధికారాలను విస్తృతం చేయాలి
-అఖిలపక్ష సమావేశంలో కేటీఆర్

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వన్ నేషన్- వన్ ఎలక్షన్ అన్న కేంద్రం ప్రతిపాదనకు తెలంగాణ సమ్మతి తెలిపింది. అదేసమయంలో రాష్ట్రాల అధికారాలను విస్తృతం చేయాల్సిన అవసరముందని తేల్చిచెప్పింది. కేంద్ర, ఉమ్మడి జాబితాలోని పలు ప్రధానరంగాలను రాష్టాలకు బదిలీచేయాలని స్పష్టంచేసింది. జమిలి ఎన్నికల నిర్వహణ, నవభారత నిర్మాణంపై బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ తరపున టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను వెల్లడించారు. జమిలి ఎన్నికల నిర్వహణలో సాధక, బాధకాలను వివరిస్తూనే, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు. లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీకి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంవల్ల ఖర్చు పెరిగిపోతుందని, పరిపాలన కూడా కుంటుపడుతుందని వివరించారు.

ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకోవాలంటే పోలింగ్ నిర్వహణకు తక్కువ సమయం ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లను సమగ్రంగా ప్రవేశపెట్టడం సులువవుతుందన్నారు. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తే మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఆస్పిరేషన్ జిల్లాలను ప్రకటించడమేకాదని.. వాటి అభివృద్ధికి కేంద్రం నిధులనిచ్చి పర్యవేక్షించాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి ఆ జాబితాలోఉన్నా అభివృద్ధికి నోచుకోలేదని ప్రస్తావించారు. కేంద్రం ఆధిపత్య ధోరణితో కాకుండా ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేస్తేనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని స్పష్టంచేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాలను పూర్తిగా రాష్ట్రప్రభుత్వాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

532
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles