మున్సిపోల్స్‌లో గులాబీ జెండా ఎగరాలి

Sun,December 15, 2019 02:32 AM

- రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్‌స్వీప్‌ చేయాలి
- టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మంత్రి హరీశ్‌రావు పిలుపు
- సంగారెడ్డి, సదాశివపేటలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి

సంగారెడ్డిఅర్బన్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలకు అతీగతీ లేదని, ప్రజా సంక్షేమానికి పనిచేసే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజల అండదండలు ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో క్లీన్‌ స్వీప్‌ చేయాలని, ఇందుకోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రం, సదాశివపేట పట్టణాల్లో మంత్రి పర్యటించి పలు అభివృద్ధ్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో 300 మందికి రూ.3.46 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కు లు, ఎస్సీ కార్పొరేషన్‌లో రెండువేల మంది లబ్ధిదారులకు రూ.30కోట్ల రుణాలు, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు రూ.75 కోట్ల మెగా చెక్కును అందజేశారు. పట్టణంలోని గిరిజన కళాశాల విద్యార్థినులు, వర్కింగ్‌ ఉమెన్‌ వసతిగృహాలను రూ.4.45 కోట్లతో నిర్మించిన నూతన భవనాలను మంత్రి ప్రారంభించారు. కంది మండలం కాశీపూర్‌లో రూ.20 కోట్లతో మైనార్టీ బాలికల వసతిగృహ భవనానికి శంకుస్థాపన చేశారు. సదాశివపేటలో రూ.4.50 కోట్లతో 30 పడకల దవాఖాన నూతన భవనాన్ని ప్రారంభించారు. కంది మండలంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సుఖప్రసవాల కోసం వసతులు మెరుగుపర్చామని, ప్రైవేట్‌ దవాఖానలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో బేవరేజెస్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అరుదైన అంబేద్కర్‌ విగ్రహం..

కుర్చీలో కూర్చున్న భంగిమలో రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అరుదైన విగ్రహాన్ని సంగారెడ్డిలో ఏర్పాటుచేశారు. సంగారెడ్డిలోని అంబేద్కర్‌ భవన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని మంత్రి హరీశ్‌రావు శనివారం ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జపనీస్‌ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. ఇలాంటి విగ్రహం చాలా అరుదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles