ప్రచార హోరు..


Thu,September 13, 2018 01:38 AM

TRS Candidates participates election campaigns

ఊరూరా గులాబీ అభ్యర్థుల ప్రచారం
మంగళహారతులు.. డప్పుచప్పుళ్లు.. బైక్ ర్యాలీలతో నీరాజనం
టీఆర్‌ఎస్ అభ్యర్థులకే మా ఓటు అంటూ గ్రామాల్లో తీర్మానాలు, ప్రతిజ్ఞలు

ఎన్నికల ప్రచారం వేడెక్కింది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఊరూరు తిరుగుతూ ప్రచారం ముమ్మరం చేశారు. బైక్ ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజలు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు. ఏ ఊరికి వెళ్లినా అభ్యర్థులకు మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో నీరాజనం పలుకుతున్నారు. బుధవారం కూడా పల్లె జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపిస్తామంటూ తీర్మానాలు చేశారు. మేం మీ వెంటే అంటూ మరికొన్ని చోట్ల ప్రతినబూనారు.

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్ :జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు బుధవారం ధర్మపురిలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. దాదాపు 2600 బైక్‌లతో రాయపట్నం నుంచి ధర్మపురి వరకు కోలాటలు, డప్పుచప్పుళ్ల నడుమ ర్యాలీ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రమేశ్‌బాబుకు స్థానికులు హారతి పట్టారు. వేములవాడలోని లేబర్ అడ్దా వద్ద కార్మికులతో మాట్లాడి వారితో కలిసి చాయ్ తాగారు. మహబూబాబాద్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ డాక్టర్ల ఇంటికి వెళ్లి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గూడురు, కేసముద్రం మండలాలతోపాటు హబూబాబాద్ మండలం శనిగపురంలో పర్యటించారు. డోర్నకల్ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ కురవి, చిన్నగూడురు మండలాల్లో పర్యటించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు రెడ్యానాయక్‌కు మద్దతుగా వందలాది వాహనాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గోపన్‌పల్లిలో జుక్కల్ అభ్యర్థి హన్మంత్ షిండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద మెదక్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. మెదక్ చర్చిలో ప్రార్థనలు చేశారు.
trs4
ఏడుపాయల వనదుర్గామాత సన్నిధి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చౌటుప్పల్ నుంచి మునుగోడు వరకు ఆరువేల బైక్‌లతో ర్యాలీని ప్రారంభించారు. అనంతరం తంగడపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి అభ్యర్థి కూసుకుంట్ల పూలమాల వేసి నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో టీఆర్‌ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తాడిపర్తిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూర్‌లో అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డి, నారాయణపేట నియోజకవర్గంలో అభ్యర్థి రాజేందర్‌రెడ్డి, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ప్రచారం నిర్వహించారు. కోస్గిలో ఎంపీ జితేందర్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే, అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో ఎన్నికలకు సంబంధించి సమాలోచనలు చేశారు.
trs3

అపవిత్ర కూటమిని ప్రజలే తరిమి కొడుతారు
-విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి


కుడకుడరోడ్డు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న పార్టీలన్నీ కలిసి నేడు అపవిత్ర కూటమిగా తయారవున్నదని, ఆ కూటమిని ప్రజలే తిప్పికొడతారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. 60 ఏండ్లుగా అన్నిరంగాల్లో వెనుకబడ్డ తెలంగాణను సీఎం కేసీఆర్ నాలుగేండ్లలో కనీవిని ఎరుగనిరీతిలో అభివృద్ధి చేశారన్నారు. బుధవారం సూర్యాపేటలోని త్రివేణి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
trs2

తీర్మానాలు - ప్రతిజ్ఞలు


కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి మంత్రి ఈటల రాజేందర్‌ను గెలిపిస్తామంటూ వీణవంక మండలం రెడ్డిపల్లిలో గీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో 300 మంది తీర్మానంతోపాటు ప్రతిజ్ఞ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో గొల్ల, కురుమ, కుమ్మరి, పద్మశాలీ కులస్థులు మంత్రి ఈటలకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. పంగిడిపల్లి, శ్రీరాంలపల్లి గ్రామాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి భారీ మెజారిటీతో మరోసారి ఈటలను గెలిపించుకుంటామన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం మల్లాపూర్‌లో కుర్మ, యాదవ సంఘాలు, గన్నేరువరం మండలం సాంబయ్యపల్లిలో పలు కుల సంఘాల వారు టీఆర్‌ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌కే ఓటు వేస్తామని తీర్మానించారు. కరీంనగర్ మండలం దుర్షేడు, కొత్తపల్లి మండలం బావుపేట వంటి మేజర్ గ్రామాల వారు కూడా కరీంనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కే ఓటు వేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ గాంధీపథం చారిటబుల్ సర్వీస్ నిర్వాహకుడు చింతలచెర్వు గెర్షోమ్ ఆధ్వర్యంలో బర్మాక్యాంపులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జలగం వెంకటరావును గెలిపిస్తామంటూ ఆ వార్డు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవికి పెనుబల్లి మండలం కేఎం బంజరు, మర్లకుంట ప్రజలు బాసటగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని చేతన్‌నగర్ గ్రామస్థులు టీఆర్‌ఎస్ వెంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరోసారి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని గెలిపిస్తామన్నారు. నిజామాబాద్ మాక్లూర్ మండలం ఆమ్రాద్, ఒడ్యాట్‌పల్లి, మదన్‌పల్లి, ముత్యంపల్లి, మానిక్‌ంబడార్ గ్రామాలతోపాటు, సట్లాపూర్, అమ్రాద్ తండాలకు చెందిన మహాలక్ష్మి ఆటో యూనియన్‌కు చెందిన సుమారు 80మంది సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతూ తీర్మానించారు. రాబోయే ఎన్నికల్లో అర్మూర్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా కారు గుర్తుకు ఓటేయాలని కోరుతూ ప్రచారంలో పాల్గ్గొంటామని తీర్మానం చేశారు. ఆసిఫాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికే మద్దతునిస్తామంటూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జెండాగూడ వాసులు ఏకగ్రీవంగా తీర్మానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరం కనకయ్యను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తామని టీబీజీకేఎస్ కార్మిక నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, కనగాల పేరయ్య ఆధ్వర్యంలో స్థానిక సింగరేణి 21 మైన్ మొదటి షిప్టులోని కార్మికులంతా బుధవారం ప్రతిజ్ఞ చేశారు.
trs1

మంత్రి లకా్ష్మరెడ్డి భారీ బైక్ ర్యాలీ..మం


వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరగా వారికి బాలానగర్ మండలం బూర్గుల వద్ద పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బూర్గుల నుంచి మంత్రి, ఎంపీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. 4 వేలకుపైగా బైకులు, కార్లతో ఆరంభమైన ర్యాలీ బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల మీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండకు చేరింది. అక్కడ మంత్రి లకా్ష్మరెడ్డి దంపతులు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారం చేశారు.

1512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles