నేవీ అమరులకు ఘన నివాళి

Thu,December 5, 2019 01:59 AM

కంటోన్మెంట్: నేవీ డే సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఉన్న అమరవీరుల స్తూపానికి బుధవారం నావికాదళ ఉన్నతాధికారులు, సైనికులు నివాళులర్పించారు. 1971 డిసెంబర్ 4న యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా ఈ రోజున దేశవ్యాప్తంగా నావికాదళ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా 8న ఐకియాలో నావికాదళ నావల్ బ్యాండ్ కచేరీ, 20 నుంచి 22 వరకు రెడ్‌క్రాస్ సంస్థ సహకారంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్టు రక్షణశాఖ పీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు.


విశాఖలో ఘనంగా నేవీ డే
విశాఖపట్నం: 1971లో పాకిస్థాన్‌పై యు ద్ధంలో గెలుపునకు తూర్పు నావికా దళం కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్‌పై గెలుపునకు ప్రతీకగా ఏటా డిసెంబర్ 4వ తేదీన నేవీ డేను నిర్వహిస్తున్నారు. తూర్పు నావి కా దళం ప్రారంభమై 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

375
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles