టీఆర్‌ఎస్‌తోనే తండాల అభివృద్ధి

Tue,October 8, 2019 03:18 AM

-తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే
-గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతిరాథోడ్
- కేటీఆర్ రోడ్‌షోతో ఉత్తమ్‌కు నిద్రపట్టడం లేదు
-మీడియాతో హుజూర్‌నగర్ ఉపఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

హుజూర్‌నగర్, నమస్తేతెలంగాణ, మేళ్లచెర్వు: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజన తండాలు పంచాయతీలు మారి అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని గిరిజన, మహి ళా శిశుసంక్షేమశాఖమంత్రి సత్యవతి రాథో డ్ అన్నారు. గిరిజనులకు స్వయంపాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా సోమవారం మేళ్లచెర్వు మండలంలోని హేమ్లాతండా, కప్పలకుంటతం డా, యతిరాజపురంతండా, రామాంజనేయతండాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కేటాయించి తండాలను అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానన్నారు. గిరిజన సోదరులు టీఆర్‌ఎస్‌ను గెలిపించి సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలని కోరారు. మండలంలోని జగ్గుతండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా చేసేందుకు కృషిచేస్తానని హామీఇచ్చారు. హేమ్లాతండా లో పలువురు నాయకులు మంత్రి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ రాంచందర్‌నాయక్ పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి సత్యవతి టీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ రమణనాయక్‌తో కలిసి చింతలపాలెం మం డలం గాంధీనగర్‌తండా, కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

p-r-reddy

తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెన్నెముకలేనివారు: పల్లా

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజూర్‌నగర్‌లో రోడ్‌షో చేసినప్పటి నుంచి ఉత్తమ్‌కు నిద్రపట్టడం లేదని, ఓడిపోతామన్న భయంతో తలాతోకలేకుండా మాట్లాడుతున్నాడని ఉపఎన్నికల టీఆర్‌ఎస్ ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్‌నగర్‌లో మీడియా తో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెన్నెముకలేనివారని, అభివృద్ధి నిరోధకులని, ఢిల్లీకి సంచులను మోసేవారని, వలసపాలకుల మోచేతి నీళ్లు తాగేవారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రవాహాన్ని తట్టుకోలేక ఉత్తమ్ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను బతిమిలాడుకుంటున్నారని అన్నా రు. పాలకవీడు మండలంలో ఇరవైమంది సర్పంచ్‌లను టీఆర్‌ఎస్ గెలుచుకున్నదని, మిగిలిన వారు కూడా అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరారన్నారు. సమావేశంలో వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles