ఠారెత్తిస్తున్న ఎండలు


Tue,April 16, 2019 01:45 AM

Thunderstorm and gale likely in parts of Telangana on Tuesday

-కరీంనగర్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీలు..
-గ్రేటర్‌లో 40.2డిగ్రీలు.. నేడు వర్షసూచన

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సోమవారం కరీంనగర్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా.. పెద్దపల్లి, మహబూబాబాద్‌లో 43.4 డిగ్రీలు, వరంగల్ రూరల్‌లో 43, ఆదిలాబాద్, మంచిర్యాల, సిద్దిపేటలో 42.8, నిజామాబాద్‌లో 42.6, సంగారెడ్డిలో 42.3డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరంవైపు నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. పగ టి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 9.2 డిగ్రీలు పెరిగి.. 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8.3 డిగ్రీలు పెరిగి 25.3 డిగ్రీలుగా నమోదైంది. రాగల మూడ్రోజుల వరకు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో నమోద య్యే అవకాశాలున్నాయి. అయితే, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల గ్రేటర్‌లోని కొన్నిచోట్ల క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ వానలు కురిసే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు.

వడదెబ్బతో ఇద్దరు మృతి

రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో ఇద్దరు మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో వడదెబ్బ కారణంగా కొంతకాలంగా అస్వస్థతకు గురైన ఏనుగంటి వీరయ్య(76) ఆదివారం రాత్రి మృతిచెందా డు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫత్తేషాపురంలో గడ్డం కొమురయ్య (50) వడదెబ్బతో మృతిచెందాడు.

summer2

ఈదురు గాలులకు నేలవాలిన భారీ వృక్షం

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండ లం అంతర్గాం గ్రామంలో సోమవారం సా యంత్రం వీచిన ఈదురు గాలులకు 70 ఏండ్లనాటి వేపచెట్టు వేళ్లతోసహా నేలకొరిగింది. గ్రామ పంచాయతీ, పీరీల బంగ్లా ఆవరణలోని ఈ చెట్టు కిందే నిత్యం పిల్లలు ఆడుకునేవారు. పెద్దలు సేదతీరేవారు. కొన్ని నిమిషాలముందే ఈ వేపచెట్టు కింద కూర్చున్న 22 మంది హనుమాన్ భక్తులు వెళ్లిపోయారని, లేకపోతే భారీ ప్రాణనష్టం జరిగేదని స్థానికులు తెలిపారు.
summer3

874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles