కొనసాగుతున్న అల్పపీడనం


Thu,September 12, 2019 02:40 AM

Thundershowers in greater hyderabad

-గ్రేటర్ హైదరాబాద్‌లో చిరుజల్లులు
హైదరాబాద్ సిటీబ్యూరో/ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాగల మూడ్రోజుల వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఉత్తర మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాం తాల్లో అల్పపీడనం, దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. సాయంత్రం మబ్బులు కమ్ముకున్నా చెప్పుకోదగిన వర్షం పడలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలు, గాలిలో తేమ 68 శాతంగా నమోదైందని చెప్పారు. గురువారం అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.

100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles