టీవీ మీదపడి బాలిక మృతి

Sun,October 13, 2019 01:24 AM

-నల్లగొండ జిల్లాలో ఘటన
మాల్: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడులో శనివారం ఉదయం టీవీ మీదపడి మూడేండ్ల బాలిక మృతిచెందింది. తీదేడు (వెంకటంపేట) గ్రామానికి చెందిన మర్ల శ్రీరాములు, సైదమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. మూడో కూతురు గౌతమి ఆడుకుంటూ వెళ్లి కేబుల్ వైరును లాగడంతో స్టాండ్ జరిగి టీవీ మీదపడింది. టీవీకి మంచానికి మధ్యలో గౌతమి ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. ఆరుబయట ఉన్న కుటుంబసభ్యులు వచ్చేలోగా ప్రాణాలు కోల్పోయింది.

76
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles